Warm Vaccine: అన్ని వేరియంట్లపై సమర్థవంతంగా పనిచేసే స్వదేశీ టీకా!

ABN , First Publish Date - 2021-07-17T13:18:13+05:30 IST

ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ (ఐఐఎస్)...

Warm Vaccine: అన్ని వేరియంట్లపై సమర్థవంతంగా పనిచేసే స్వదేశీ టీకా!

న్యూఢిల్లీ: ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ (ఐఐఎస్సీ), బయోటెక్ కంపెనీ మినోవ్యాక్స్ సంయుక్తంగా రూపొందించిన వార్మ్ వ్యాక్సీన్ కరోనాకు సంబంధించిన అన్ని వేరియంట్లపైనా సమర్థవంతంగా పనిచేస్తోంది. ఈ వ్యాక్సిన్‌పై సిస్రో చేసిన విశ్లేషణలో ఈ విషయం వెల్లడయ్యింది. ఈ వ్యాక్సీన్‌ను వార్మ్(వేడి) అని ఎందుకంటారంటే దీనిని 90 నిముషాల పాటు 100 డిగ్రీ సెల్సియస్ ఉష్ణోగ్రత వద్దకూడా సురక్షితంగంగా ఉంచవచ్చు. 



37 డిగ్రీ సెల్సియస్ వద్ద ఈ వ్యాక్సీన్‌ను స్థిరంగా ఉంచవచ్చు. మిగిలిన వ్యాక్సీన్లను కనీస ఉష్టోగ్రత వద్ద ఉంచాల్సివస్తుండగా, ఈ వ్యాక్సీన్ అత్యధిక ఉష్ణోగ్రతలోనూ పాడవకుండా ఉంటుంది. ఎలుకలపై ఈ వ్యాక్సీన్ ప్రయోగించగా వాటిలో కరోనాతో పోరాడే విధంగా బలమైన ఇమ్యూన్ రెస్పాన్స్ అభివృద్ధి చెందింది. ఈ వ్యాక్సీన్‌ను వైరస్‌లోని స్పైక్ ప్రోటీన్‌లోగల ఒక భాగంలో తీసుకు వచ్చిన మార్పులతో రూపొందించారు. ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్, బెంగళూరు తయారు చేసిన ఈ వార్మ్ వ్యాక్సీన్ కరోనా వేరియంట్‌లు అయిన అల్ఫా, బీటా, డెల్టా, కప్పాలై సమర్థవంతంగా పనిచేస్తుందని పరిశోధనల్లో తేలింది.

Updated Date - 2021-07-17T13:18:13+05:30 IST