ఓటు విలువైనది

ABN , First Publish Date - 2022-01-26T04:23:23+05:30 IST

ప్రజాస్వామ్యంలో ప్రతీ ఓటు విలువైనదని జిల్లా అదనపు

ఓటు విలువైనది
స్నేహకు ఓటర్‌ కార్డును అందజేస్తున్న అదనపు కలెక్టర్‌ ప్రతీక్‌జైన్‌

ఆంధ్రజ్యోతి, రంగారెడ్డి అర్బన్‌, జనవరి 25 : ప్రజాస్వామ్యంలో ప్రతీ ఓటు విలువైనదని జిల్లా అదనపు కలెక్టర్‌ ప్రతీక్‌జైన్‌ అన్నారు. కలెక్టరేట్‌లోని కోర్టు హాల్లో మంగళవారం 12వ జాతీయ ఓటరు దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులు, సిబ్బందిచే ప్రతిజ్ఞ చేయించారు. చీఫ్‌ ఎలక్షన్‌ కమిషనర్‌ ఆఫ్‌ ఇండియా సుశీల్‌చంద్ర సందేశాన్ని వినిపించారు. ఓటరు దినోత్సవం సందర్భంగా ముగ్గురు సీనియర్‌ ఓటర్లను సన్మానించారు. కొత్త ఓటర్లుగా నమోదైన స్నేహ, ఉమామహేశ్వరి, ఆదిత్యఘో్‌షలకు ఓటరు కార్డులను అందజేశారు. అనంతరం అదనపు కలెక్టర్‌ మాట్లాడుతూ ప్రజాస్వామ్యాన్ని కాపాడే బాధ్యత ప్రతి పౌరునిపై ఉంటుందన్నారు. 18 సంవత్సరాలు నిండిన ప్రతిఒక్కరూ ఓటరుగా పేరు నమోదు చేసుకోవాలని సూచించారు. ఎలాంటి ప్రలోభాలకు లొంగకుండా మంచి నాయకుడిని ఎన్నుకోవాలని సూచించారు. కార్యక్రమంలో డీఆర్వో హరిప్రియ, జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి ప్రభాకర్‌, డీఈవో సుశీందర్‌రావు, సీపీవో ఓం ప్రకాశ్‌, అధికారులు పాల్గొన్నారు.



Updated Date - 2022-01-26T04:23:23+05:30 IST