ఓటు వజ్రాయుధం

ABN , First Publish Date - 2022-01-25T04:51:17+05:30 IST

ప్రజలకు రాజ్యాంగం కల్పించిన వజ్రాయుధం ఓటు హక్కు. ఎన్నికలు వచ్చాయంటే ఓటరు వద్దకు రాజకీయ నాయకులు ప రుగులు తీస్తారు.

ఓటు వజ్రాయుధం
ఓటు హక్కును వినియోగించుకుంటున్న మహిళలు (ఫైల్‌)

-  ఓటు నమోదుకు విస్తృత ప్రచారం

- జిల్లాలో 4,33,060 మంది ఓటర్లు 

- నేడు జాతీయ ఓటరు దినోత్సవం 

నారాయణపేట, జనవరి 24: ప్రజలకు రాజ్యాంగం కల్పించిన వజ్రాయుధం ఓటు హక్కు. ఎన్నికలు వచ్చాయంటే ఓటరు వద్దకు రాజకీయ నాయకులు ప రుగులు తీస్తారు.  సామాన్యుడి నిర్ణయాలతో రాజకీ యలు, దేశ భవిష్యత్‌లోనూ మార్పులు వస్తాయి. ఓటు హక్కు పొందడానికి ఎన్నికల కమిషన్‌ విస్తృత ప్రచారం నిర్వహిస్తోంది. ఆధునిక సాంకేతిక మార్గాల ద్వారా ప్రచారం చేస్తోంది.  మంగళవారం జాతీయ ఓటరు దినోత్సవాన్ని జరుపుకోనున్నారు. 18ఏళ్లు నిండి న యువతీ యువకులు తప్పక  ఓటరుగా పేరు నమోదు చేసుకోవాలి. ఓటరుగా పేరు నమోదు కోసం ఫారం 6ను వినియోగించుకోవాలి. పేరు తొలగించడానికి ఫారం 7ను, పేరులో సవరణ చేసుకోవడానికి ఫారం 8ను, ఒక నియోజకవర్గం నుంచి మరో నియోజకవర్గానికి పేరును బదిలీ చేసుకోవడానికి ఫారం 8ఏను ఉపయోగించుకోవాలి. జాతీయ ఓటరు దినోత్సవాన్ని పురస్కరించుకొని అధికార యంత్రాగం  ఓటు హక్కుపై అవగాహన కల్పించేందుకు సదస్సులను నిర్వహిస్తారు. 

నారాయణపేట జిల్లాలో..  

నారాయణపేట జిల్లాలో 4,33,060 మంది ఓటర్లు ఉన్నారు. ఇందులో పురుషులు 2,14,526 మంది, మహిళలు 2,18,532మంది ఉన్నారు. 18-19 ఏళ్లు నిండిన వారు 2,278 మంది కొత్త ఓటర్లు, ఇతరులు ఇద్దరు ఉన్నారు. కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల మే రకు కొత్త ఓటర్ల జాబితాను రాష్ట్ర ఎన్నికల సంఘం ఈనెల 5న ప్రచురించింది. జిల్లాలో మక్తల్‌, నారాయ ణపేట నియోజక వర్గాలతో పాటు కొడంగల్‌ నియోజ క వర్గంలోని కోస్గి, మద్దూర్‌ మండలాలు ఉన్నాయి. మక్తల్‌ నియోజక వర్గంలో 2,20,740 మంది ఓటర్లు ఉండగా అందులో పురుషులు 1,09,124 మంది, మ హిళలు 1,11,614 మంది, ఇతరులు ఇద్దరు ఉన్నారు. నారాయణపేట నియోజకవర్గంలో 2,12,320 మంది ఓ టర్లు ఉండగా అందులో పురుషులు 1,05,402 మంది, మహిళలు 1,06,918మంది ఓటర్లు ఉన్నారు. కొడంగల్‌ నియోజకవర్గంలో 2,16,822 మంది ఓటర్లు ఉండగా అందులో పురుషులు 1,07,925 మంది, మహిళలు 1,08,891మంది, ఇతరులు ఆరుమంది ఓటర్లు ఉన్నారు. 

Updated Date - 2022-01-25T04:51:17+05:30 IST