ఓటు వజ్రాయుధం

ABN , First Publish Date - 2021-01-25T04:53:19+05:30 IST

ఓటే వజ్రాయుధం. ప్రజాస్వామ్య భారతదే శంలో ప్రజా ప్రతినిధులను ఎన్నుకునేందుకు ప్రతీ ఒక్కరు ఓటు హక్కును వినియోగించుకుంటారు.

ఓటు వజ్రాయుధం

- ప్రతీ ఒక్కరు ఓటు హక్కు కల్గిఉండాలి

- నేడు జాతీయ ఓటరు దినోత్సవం 


నారాయణపేట, జనవరి 24 : ఓటే వజ్రాయుధం. ప్రజాస్వామ్య భారతదే శంలో ప్రజా ప్రతినిధులను ఎన్నుకునేందుకు ప్రతీ ఒక్కరు ఓటు హక్కును వినియోగించుకుంటారు. ఈనెల 25న సోమవారం జాతీయ ఓటరు దినోత్సవాన్ని జరుపుకుంటాం. 18 ఏళ్లు నిండిన యువతీ యువకులు తప్పక తమ ఓటు హక్కును కల్గి ఉండాలి. 1950లో దేశంలో అమలులోకి వచ్చిన సార్వత్రిక వయోజన ఓటు హక్కు దేశ రాజకీయ చరిత్రలోనే ఎంతో విప్లవాత్మకమైన మార్పును తెచ్చింది. భారత రాజ్యంగం ఆర్టికల్‌ 324 కింద కేంద్ర ఎన్నికల సంఘాన్ని ఏర్పాటు చేసింది. ఓటరుగా పేరు నమోదు కోసం ఫారం 6ను వినియోగించు కోవాలి. పేరు తొలగించడానికి పారం 7ను, పేరులో సవరణ చేసు కోవడానికి ఫారం 8ను, ఒక నియోజక వర్గం నుంచి మరోక నియోజక వర్గానికి పేరును బదిలీ చేసు కోవడానికి ఫారం 8 ఏను ఉపయోగించు కోవాలి. ఎన్నికల్లో ఓటరుగా పేరు నమోదు చేసుకోవడం అనేది 18 ఏళ్లు నిండిన యువతి యువకులు కొత్తగా ఓటరుగా నమోదు చేసు కోవడంతో పాటు ఎన్నికల్లో ఓటరుగా పేరు నమోదు చేసుకోవడం అనేది నిరంతర ప్రక్రియ. 

ఓటర్ల ప్రతిజ్ఞ : భారత దేశ పౌరులమైన మేము, ప్రజాస్వామ్యంపై విశ్వాసంతో, మన దేశ ప్రజాస్వామ్య సంప్రదాయాలను, స్వేచ్ఛాయుత, నిష్పక్షపాత, ప్రశాంతత ఎన్నికల ప్రభావాన్ని నిల బెడుతామనీ, మతం, జాతి, కులం, వర్గం, భాష, లేదా ఎటువంటి ఒత్తిడిలకు ప్రభావితం కాకుండా ప్రతి ఎన్నికలలో నిర్భయంగా ఓటు వేస్తామని ఓటరు దినోత్సవం రోజు ప్రతిజ్ఞ చేస్తారు.  

జిల్లాలో 4,35,691 ఓటర్లు : పేట జిల్లా వ్యాప్తంగా 4,35,691 లక్షల మంది ఓటర్లు ఉన్నారు. ఇందులో 18 నుంచి 19 ఏళ్ల వయసు మధ్య 1,030 మంది ఓటర్లు, 20 నుంచి 29 ఏళ్లమధ్య 98,870 మంది ఓటర్లు, 30 నుంచి 39 ఏళ్ల మధ్య 1,39,066 మంది ఓటర్లు, 40 నుంచి 49 ఏళ్ల మధ్య 88,439 మంది ఓటర్లు, 50 నుంచి 59 ఏళ్ల మద్య 56,704 మంది ఓటర్లు, 60 నుంచి 69 ఏళ్ల మధ్య 33,486 మంది ఓటర్లు, 70 నుంచి 79 ఏళ్ల మద్య 14,280 ఓటర్లు, 80 ఏళ్ల పైబడిన వారు 3,816 మంది ఓటర్లు ఉన్నారు. జిల్లాలో మక్తల్‌, నారాయ ణపేట నియోజకవర్గాలతో పాటు కొడంగల్‌ నియోజక వర్గంలోని మద్దూర్‌, కోస్గి రెండు మండలాలు ఉన్నాయి. 

Updated Date - 2021-01-25T04:53:19+05:30 IST