కరోనా 1022..42 మండలాలకు విస్తరించిన వైరస్‌

ABN , First Publish Date - 2020-06-30T10:29:22+05:30 IST

మహమ్మారి కరోనా అతి వేగంగా విస్తరిస్తూ 42 మండలాలకు పాకింది. తాజాగా సోమవారం 71 మందికి పాజిటివ్‌ నిర్ధారణ అయినట్లు

కరోనా 1022..42 మండలాలకు విస్తరించిన వైరస్‌

29 రోజుల్లో 886 కేసులు

తాజాగా 71 మందికి పాజిటివ్‌ నిర్ధారణ

40 మంది డిశ్చార్జ్‌


కడప, జూన్‌29 (ఆంధ్రజ్యోతి): మహమ్మారి కరోనా అతి వేగంగా విస్తరిస్తూ 42 మండలాలకు పాకింది. తాజాగా సోమవారం 71 మందికి పాజిటివ్‌ నిర్ధారణ అయినట్లు వైద్య ఆరోగ్యశాఖ అధికారులు తెలిపారు. వీరితో కలిపి కరోనా బాధితుల 1022కి చేరింది. ఇప్పటి వరకూ జిల్లాలో కాశినాయన, గోపవరం, తొండూరు, రామాపురం, వీరపునాయునిపల్లె, సుండుపల్లి, బి.మఠం, బి.కోడూరు మండలాల్లో మాత్రమే కరోనా కేసులు నమోదు కాలేదు. కడప, ప్రొద్దుటూరు, పులివెందుల పట్టణాల్లో మరింత వేగంగా విస్తరిస్తోంది. తాజాగా నమోదైన 71 కేసుల్లో కడపలో 26, ప్రొద్దుటూరులో 15, మైలవరంలో 4, సీకే దిన్నెలో 5, మైదుకూరులో 5, రాజంపేటలో 3, పులివెందుల, రాజుపాలెంల్లో 2, రైల్వేకోడూరు, దువ్వూరు, సింహాద్రిపురం, ముద్దనూరు, కలసపాడు, ఎర్రగుంట్ల, రాయచోటి, బద్వేల్‌ మండలాల్లో ఒక్కొక్క కేసు నమోదైంది. ఇప్పటి దాకా కడప నగరంలో 157, ప్రొద్దుటూరులో 219, పులివెందులలో 123, మైలవరం మండలంలో 133 కేసులు నమోదయ్యాయి. కాగా కోవిడ్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారిలో సంపూర్ణంగా కోలుకుని 40 మంది సోమవారం డిశ్చార్జ్‌ అయ్యారు.


నో మాస్క్‌..నో ఏంట్రీ

జిల్లాలో కరోనాను కాస్తయినా కట్టడి చేయాలని జిల్లా యంత్రాంగం కఠిన చర్యలకు ఉపక్రమించింది. కలెక్టర్‌ సి.హరికిరణ్‌ అధ్యక్షతన జిల్లా కోవిడ్‌ కమిటీ సమావేశమైంది. ప్రొద్దుటూరు, కడప, పులివెందులతో పాటు ప్రధాన పట్టణాల్లో వ్యాపారులు, చిరు వ్యాపారులు తప్పనిసరిగా మాస్క్‌, గ్లౌజులు, శానిటైజర్‌ ఉపయోగించాలని, భౌతిక దూరం పాటిస్తూ వ్యాపారం చేయాలని, ప్రతి షాపు ముందు నోమాస్క్‌ నో ఏంట్రీ బోర్డు  ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. పట్టణ వీధుల్లోకి మాస్క్‌లు లేకుండా వస్తే రూ.300లు జరిమానా విధిస్తారు.


కడప నగరం విలవిల

కడప నగరం కరోనా వ్యాప్తితో విలవిల్లాడుతోంది. సోమవారం ఒక్కరోజే 26 కేసులు నమోదయ్యాయి. దేవునికడప, నెహ్రూనగర్‌, ఎర్రముక్కపల్లి, కో ఆపరేటివ్‌ కాలనీ, ఎన్జీవోస్‌కాలసీ, ఇందిరానగర్‌, సింహపురికాలనీ, శాస్ర్తినగర్‌లలో తాజాగా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. 


కరోనా ఆప్‌డెట్స్‌ 

  • శాంపిల్స్‌ తీసినవి - 69496
  • రిజల్ట్స్‌ వచ్చినవి 65796
  • నెగిటివ్‌ 64774
  • పాజిటివ్‌ 1022
  • ఫలితాలు రావాల్సినవి 3700
  • 29న తీసిని శాంపిల్స్‌ 1622
  • డిశ్యార్జి అయిన వారు 402
  • యాక్టివ్‌ కేసులు 620 
  • మృతులు 7

Updated Date - 2020-06-30T10:29:22+05:30 IST