పల్లెలు పచ్చదనంతో వికసించాలి

ABN , First Publish Date - 2020-05-24T09:35:53+05:30 IST

‘పల్లెప్రగతి’ని పకడ్బందీగా చేపట్టి గ్రామాలను పచ్చదనంతో వికసింపజేయాలని పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి

పల్లెలు పచ్చదనంతో వికసించాలి

పంచాయతీరాజ్‌శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు


మహబూబాబాద్‌ టౌన్‌, మే 23 : ‘పల్లెప్రగతి’ని పకడ్బందీగా చేపట్టి గ్రామాలను పచ్చదనంతో వికసింపజేయాలని పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు సూచించారు. ‘పల్లెప్రగతి’పై హైదరాబాద్‌ నుంచి శనివారం సాయంత్రం వీడియోకాన్ఫరెన్స్‌ నిర్వహించి కలెక్టర్లు, జడ్పీచైర్మన్లతో సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ వీపీ.గౌతమ్‌ మాట్లాడుతూ వర్షాకాలానికి ముందే అన్ని గ్రామాల్లో పరిసరాల పరిశుభ్రతపై చైతన్యపరుస్తున్నామని తెలిపారు.


ఉపాధిహామీ పథకం జాబ్‌కార్డులు 68 వేలు ఉండగా, వాటిని 90వేలకు పెంచామని, జిల్లాలోని 16మండలాకు ముగ్గురు ప్రత్యేక అధికారులను నియమించామని తెలిపారు. జడ్పీ చైర్‌పర్సన్‌ ఆంగోతు బిందు మాట్లాడుతూ బయ్యారం, కొత్తగూడ, గంగారం మండలాల్లో ట్రీగార్డులను ప్రజాప్రతినిధులు ఏర్పాటు చేయిస్తున్నారని చెప్పారు. కాగా జిల్లాలో హరితహారం, వైకుంఠధామాల నిర్మాణాలపై పర్యవేక్షించాలని మంత్రి దయాకర్‌రావు సూచించారు. వీసీలో అదనపు కలెక్టర్‌ ఎం.వెంకటేశ్వర్లు, జడ్పీ సీఈవో సన్యాసయ్య, డీఆర్‌డీఏ పీడీ విద్యాచందన, డీపీవో రంగాచారి పాల్గొన్నారు. 

Updated Date - 2020-05-24T09:35:53+05:30 IST