Abn logo
Jun 18 2021 @ 23:47PM

గ్రామస్థులే పెద్దలుగా..

కొత్తవలస,  జూన్‌ 18: తండ్రి చనిపోవడం, తల్లి అనారోగ్యంతో మంచం పట్టడంతో వారి కుమార్తె వివాహానికి గ్రామస్థులే పూనుకున్నారు. ఆ వివరాలిలా ఉన్నాయి.  ములగపాక వానిపాలెం గ్రామానికి చెందినకె.కనక రాజు అనారోగ్యంతో కొంతకాలం కిందటే చనిపోయాడు. భార్య లక్ష్మి పక్షవాతంతో మంచం పట్టింది. వీరి కుమార్తె సాయి అనాథగా మిగిలిపోయింది. పెళ్లీడుకు వచ్చిన కుమార్తెకు తాను ఏమి చేయలేని నిస్సహాయ స్థితిలో ఉన్నానంటూ మంచం పట్టినతల్లికి.. గ్రామస్థులు హామీ ఇచ్చారు. కుమార్తె బాధ్యతను తీసుకుంటామని, పెళ్లి చేస్తామని కూడా గతంలో భరోసా ఇచ్చారు. ఆ మేరకు సాయికి పెళ్లి చేయడానికి ఇటీవల నిశ్చయించారు. విశాఖపట్టణానికి చెందిన సంబంధం రావడంతో లక్ష్మికి పెళ్లి ఖాయం చేశారు. శుక్రవారం విశాఖలో లక్ష్మికి పెళ్లి చేశారు. గ్రామంలోని ఉద్యోగులు, యువకులు కలిసి రూ.90 వేల వరకు సేకరించారు. ములగపాక పైడిరాజు 16 వేల రూపాయలతో శతమానాలు (తాళిబొట్టు) బహూకరించారు. గ్రామంలోని పలు కుటుంబాల వారు పెళ్లికి అవసరమైన స్వీట్లును, పిండివంటలను తయారు చేసి అందచేశారని సత్యసాయి సేవా సమితి కన్వీనర్‌ పి.రవికుమార్‌ తెలిపారు. ఈ విషయం తెలిసిన అందరూ గ్రామస్థులను అభినందిస్తున్నారు.