పల్లెకో పార్కు!

ABN , First Publish Date - 2020-07-06T11:11:19+05:30 IST

పట్టణాల్లో పేదలకు ఆహ్లాదాన్ని అందించేందుకు పార్క్‌లు ఉంటాయి. దీంతో పట్టణ వాసులు తమ పిల్లలతో కలిసి పార్క్‌లకు వెళ్లి కాసేపు సేద తీరుతుంటారు. కానీ గ్రామాల్లో అలాంటి పార్క్‌లు కనిపించవు.

పల్లెకో పార్కు!

గ్రామాల్లో ప్రకృతి వనం పేరుతో పార్కుల ఏర్పాటుకు చర్యలు

స్థలాల సేకరణకు ప్రభుత్వం ఆదేశాల జారీ

జిల్లాలో 526 గ్రామ పంచాయతీలు

ప్రతీ గ్రామ పంచాయతీకి పార్కు ఏర్పాటు చేయాలని నిర్ణయం

కసరత్తు ప్రారంభించిన జిల్లా పంచాయతీ శాఖ

ఒక్కో పార్కులో 4 వేల మొక్కల పెంపకం


కామారెడ్డి, జూలై 5(ఆంధ్రజ్యోతి): పట్టణాల్లో పేదలకు ఆహ్లాదాన్ని అందించేందుకు పార్క్‌లు ఉంటాయి. దీంతో పట్టణ వాసులు తమ పిల్లలతో కలిసి పార్క్‌లకు వెళ్లి కాసేపు సేద తీరుతుంటారు. కానీ గ్రామాల్లో అలాంటి పార్క్‌లు కనిపించవు. అయితే పల్లె ప్రజలకు ఆహ్లా దం పంచేందుకు పార్క్‌లు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రతీ గ్రామ పంచాయతీ పరిధిలో పల్లె ప్రకృతి వనం పేరుతో పార్కులను ఏర్పాటు చేయడానికి చర్యలు ప్రారంభించింది. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు కూడా జారీ చేసింది. జిల్లాలో 526 గ్రామ పంచా యతీలు ఉన్నాయి. చిన్న గ్రామాల్లో 20 గుంటల విస్తీర్ణంలో వెయ్యి వర కు వివిధ రకాల పూల మొక్కలు, పెద్ద గ్రామాల్లో ఎకరం విస్తీర్ణంలో నాలుగు వేల మొక్కలతో పార్క్‌లను ఏర్పాటు చేయనున్నారు. ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు పల్లె ప్రకృతి వనం ఏర్పాటుకు స్థలాలను గుర్తించాల ని అధికారులకు ప్రభుత్వం ఆదేశించింది.


పార్కుల కోసం స్థలాల పరిశీలన 

గ్రామాల్లో పార్కుల ఏర్పాటు కోసం మండల అధికారులు, గ్రామ సర్పంచ్‌లకు ఇటీవల అవగాహన కల్పించారు. స్థలాలు సేకరించేందుకు అధికార యంత్రాగానికి సహకరించాలని సూచించారు. దీంతో అధికారు లు గ్రామాల్లో ప్రభుత్వ భూములను అన్వేషించే పనిలో పడ్డారు. ప్రస్తుతం ఆయా గ్రామాల పరిధిలో ప్రభుత్వ భూముల వివరాలను సేకరిస్తున్నారు. జిల్లాలోని ఆయా గ్రామ పంచాయతీలలో రెవెన్యూశాఖ, ఉపాధిహామి, మండల పరిషత్‌ అధికారులు స్థలాలను పరిశీలిస్తున్నా రు. గ్రామంలో ఖాళీగా ఉన్న స్థలాలను ఎంపిక చేస్తున్నారు. ఇప్పటికే కొన్ని గ్రామాల్లో స్థలాలను గుర్తించినట్లు అధికారులు చెబుతున్నారు. గ్రామాల్లో ప్రభుత్వ భూమి అందుబాటులో లేకుంటే దాతలు ముందు కు వచ్చి ఇచ్చిన స్థలాల్లో ఏర్పాటు చేసే అవకాశాలు ఉన్నాయని అధికా రులు పేర్కొంటున్నారు.


జిల్లాలో 526 పార్కులు

జిల్లాలోని కామారెడ్డి, ఎల్లారెడ్డి, బాన్సువాడ, జుక్కల్‌ నియోజకవ ర్గాల పరిధిలో మొత్తం 526 గ్రామ పంచాయతీలలో పార్క్‌లు ఏర్పాటు కానున్నాయి. ఒక్కో పార్కుకు కనీసం 20 గుంటల భూమికి తక్కువ కాకుండా అధికారులు ప్రభుత్వ భూమిని సేకరిస్తున్నారు. జిల్లాలోని అన్ని పంచాయతీలలో పార్కుల నిర్వహణకు అనువుగా ఉన్న భూములను మండల పరిషత్‌ అధికారి, తహసీల్దార్‌ ఆఽధ్వర్యంలో సేకరిస్తున్నారు. అందరికీ అందుబాటులో ఉండే ప్రభుత్వ భూమి లేదా గ్రామ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో ఉన్న భూమిని పార్క్‌ల నిర్వహ ణకు ప్రతిపాదించనున్నారు.


ఉపాధిహామీ నిధులతో పార్కుల అభివృద్ధి

జిల్లాలోని ఆయా గ్రామ పంచాయతీలలో పార్కుల ఏర్పాటుకు ఉపాధిహామీ నిధులను ఖర్చు చేయనున్నారు. పార్కులను ఏర్పాటు చేస్తే చిన్నపిల్లలు ఆడుకునేందుకు, పెద్ద వారికి వాకింగ్‌తో పాటు సేద తీరడానికి ఎంతగానో ఉపయోగపడుతాయని పలువురు పేర్కొంటున్నా రు. వీటి ఏర్పాటుకు జాతీయ గ్రామీణ ఉపాధిహామీ పథకం నిధులను ఉపయోగించనున్నారు.


ఈ నిధులతో పార్కుల ఏర్పాటుతో పాటు చిన్నపిల్లలు ఆడుకోవడానికి వివిధ రకాల ఆట పరికరాలను ఏర్పాటు చేయనున్నారు. హరితహారం కిందకు వచ్చే ఈ కార్యక్రమానికి గ్రామ పంచాయతీలకు విడుదలయ్యే నిధులలో 10 శాతం కేటాయించాలని ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది. జిల్లాలో ఏర్పాటు చేయనున్న పల్లె పార్కులలో 4వేల మొక్కలను పెంచేందుకు ఏర్పాటు చేయాలని అధికా రులు నిర్ణయించారు. పూల మొక్కలు పెంచడానికి ప్రాధాన్యం ఇవ్వను న్నారు. జిల్లాకు కేటాయించిన హరితహారం లక్ష్యం చేరువయ్యేందుకు పార్కులు దోహదం కానున్నాయి. ఇప్పటికే గ్రామాల్లో గ్రీన్‌జోన్‌లను ఏర్పాటు చేసి ప్రత్యేక శ్రద్ధతో మొక్కల పెంపకం కొనసాగిస్తున్నారు. 


స్థలాలను గుర్తిస్తున్నాం- నరేష్‌, డీపీవో

జిల్లాలోని ఒక్కో గ్రామ పంచాయతీలలో పార్కులు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. ఈ నేపథ్యంలో పార్కుల ఏర్పా టుకు చర్యలు తీసుకుంటున్నాం. ఆయా గ్రామాల్లో ప్రభుత్వ స్థలాల ను సంబంఽఽధిత శాఖల సమన్వయంతో గుర్తిస్తున్నాం. జిల్లాలోని 526 గ్రామ పంచాయతీలలో పార్కుల ఏర్పాటు చేయనున్నాం.

Updated Date - 2020-07-06T11:11:19+05:30 IST