Viral Video: అరె! ఆ నీటి తొట్టిలో ఉండడమే ఈ బాతు పాపమైందే.. తప్పించుకుందామని చూసినా వదలని పులి..

ABN , First Publish Date - 2022-04-10T15:41:53+05:30 IST

అడవిలోని జంతువులు.. ఆహారం కోసం చేసే ప్రయత్నాలు ఒక్కోసారి విచిత్రంగా ఉంటాయి. ఇక క్రూరమృగాలు వేటాడే సమయంలో కొన్నిసార్లు ఆహారం ఈజీగా దొరికినా...

Viral Video: అరె! ఆ నీటి తొట్టిలో ఉండడమే ఈ బాతు పాపమైందే.. తప్పించుకుందామని చూసినా వదలని పులి..

అడవిలోని జంతువులు.. ఆహారం కోసం చేసే ప్రయత్నాలు ఒక్కోసారి విచిత్రంగా ఉంటాయి. ఇక క్రూరమృగాలు వేటాడే సమయంలో కొన్నిసార్లు ఆహారం ఈజీగా దొరికినా, మరికొన్ని సార్లు ఎంత ప్రయత్నించినా నిరాశే ఎదురవుతుంటుంది. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా పులికి సంబంధించిన ఓ వీడియో వైరల్ అవుతోంది. నీటి తొట్టెలో ఓ బాతు సరదాగా ఈత కొడుతూ ఉంటుంది. అదే సమయంలో పులులు అక్కడికి వస్తాయి. వాటి నుంచి తప్పించుకునేందుకు బాతు ఎంతో ప్రయత్నిస్తుంది. అయినా దాని ప్రయ్నాలు చివరికి విఫలమవుతాయి.


ఇన్‌స్టాగ్రాంలో ఓ వీడియో వైరల్ అవుతోంది. నీటి తొట్టెలో రెండు పులులు ఆహారం కోసం ఎదురు చూస్తుంటాయి. తొట్టి పైన ఇంకో పులి కూడా ఆశగా వేచి చూస్తూ ఉంటుంది. ఇంతలో ఓ బాతు నీటిలో మునుగుతూ, తేలుతూ ఆడుకుంటూ ఉంటుంది. దాన్ని గమనించిన పులి..‘‘ ప్రస్తుతానికి ఈ బాతుతో సరిపెట్టుకుందాం’’.. అనుకుంటూ పట్టుకునేందుకు ప్రయత్నిస్తుంది. అయితే బాతు దానికి చిక్కకుండా నీటిలో మునుగుతూ తప్పించుకుంటుంది. మొదటి సారి దానిపై పంజా విసరగానే వెంటనే నీటిలోకి మునిగి.. దూరంగా తేలుతుంది. 

అడవిలోని చిరుత అనూహ్యంగా బావిలో కొట్టుమిట్టాడం చూసి షాకైన జనం.. చివరికి..


మళ్లీ ఎలాగైనా పట్టుకోవాలని వేగంగా వెళ్లి పంజా విసురుతుంది. అయితే రెండోసారి కూడా పులికి నిరాశే మిగులుతుంది. నీటిలో మునిగిన బాతు.. కాసింత దూరంలో తేలుతుంది. దీంతో పులికి చిర్రెత్తుకొస్తుంది. ఈసారి ఎలాగైనా బాతును పట్టుకోవాలనుకుని.. వేగంగా వెళ్లి ఒక్కసారిగా దానిపై దాడి చేస్తుంది. మూడోసారి మాత్రం బాతు ప్రయత్నాలు విఫలమై.. పులి నోటికి చిక్కుతుంది. ‘‘నాతోనే ఆడుకుంటావా...’’ అని అనుకుంటూ బాతును నోటితో పట్టుకుని తొట్టి బయటికి వెళ్లిపోతుంది. ఈ వీడియోపై నెటిజన్లు వివిధ రకాలుగా కామెంట్లు పెడుతున్నారు. 

వామ్మో! మొసలిపై దర్జాగా కూర్చుని మరీ డ్యాన్స్ చేస్తున్నాడు.. చూస్తే ఆశ్చర్యపోవాల్సిందే...





Updated Date - 2022-04-10T15:41:53+05:30 IST