Shocking Video: షూ వేసుకునే ముందు ఒకసారి చెక్ చేసుకోండి.. లేదంటే ఇలాంటి పరిస్థితి ఎదురవ్వొచ్చు..

ABN , First Publish Date - 2022-08-11T03:01:15+05:30 IST

అసాధ్యమనుకున్న సందర్భాల్లో కొన్ని ఆశ్చర్యకర సంఘటనలు చోటు చేసుకోవడం అప్పుడప్పుడూ చూస్తుంటాం. కొందరు ఏమరపాటులో ఉంటూ ఊహించని ప్రమాదానికి గురైన సందర్భాలను కూడా..

Shocking Video: షూ వేసుకునే ముందు ఒకసారి చెక్ చేసుకోండి.. లేదంటే ఇలాంటి పరిస్థితి ఎదురవ్వొచ్చు..

అసాధ్యమనుకున్న సందర్భాల్లో కొన్ని ఆశ్చర్యకర సంఘటనలు చోటు చేసుకోవడం అప్పుడప్పుడూ చూస్తుంటాం. కొందరు ఏమరపాటులో ఉంటూ ఊహించని ప్రమాదానికి గురైన సందర్భాలను కూడా తరచూ చూస్తుంటాం. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ చక్కర్లు (Viral videos) కొడుతుంటాయి. ప్రస్తుతం వైరల్ అవుతున్న వీడియో కూడా ఇలాంటిదే. షూ వేసుకునేందుకు ప్రయత్నించిన ఓ వ్యక్తికి.. షాకింగ్ దృశ్యం కనిపించింది. టైం బాగుండడంతో ప్రాణాపాయం నుంచి బయటపడ్డాడు.


సోషల్ మీడియాలో (Social media) ఓ వీడియో వైరల్ అవుతోంది. ఓ వ్యక్తి షూ వేసుకునేందుకు చెప్పుల స్టాండ్ వద్దకు వెళ్తాడు. తీరా షూ బయటికి తీసి, వేసుకునే సమయంలో లోపల చూసి షాక్ అవుతాడు. ఓ నాగుపాము (snake) అందులో పడుకుని తల బయటికి పెట్టి ఉండడంతో ఒక్కసారిగా అతడి మైండ్ బ్లాక్ అవుతుంది. వామ్మో!.. అనుకుంటూ అక్కడి నుంచి పరుగందుకుంటాడు. చివరకు స్నేక్‌ క్యాచర్‌కి సమాచారం అందిస్తారు. అక్కడి వచ్చిన అతను.. ఎంతో చాకచక్యంగా పామును బయటికి తీస్తాడు. లోపల పడుకుని ఉన్న పాము.. ఒక్కసారిగా బుసలు కొడుతూ బయటికి వస్తుంది. అనంతరం దాన్ని పట్టుకుని అడవిలో వదిలేస్తాడు. మొత్తానికి ఎవరికీ ఎలాంటి ప్రమాదమూ జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకుంటారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా కామెంట్లు పెడుతున్నారు.

Rare operation: కంటి కింద నొప్పితో ఆస్పత్రికి వెళ్లిన యువకుడు.. స్కానింగ్ చేసిన వైద్యులకు షాకింగ్ దృశ్యం.. చివరకు..





Updated Date - 2022-08-11T03:01:15+05:30 IST