ప్రమాదంలో ఉన్న సమయంలో మనుషులను సాటి మనుషులు రక్షించడం చూశాం. మనుషులకు మిగతా జంతువుల కంటే తెలివితేటలు ఎక్కువ కాబట్టి.. ఎమోషన్స్ ఉంటాయి. అలాగే జంతువులు కూడా సాటి జంతువులను ప్రమాదం నుంచి రక్షించడం జరుగుతూ ఉంటుంది. ఇందుకు సంబంధించిన వీడియోలను సోషల్ మీడియాలో చాలా చూశాం. అయితే మనుషులను జంతువులు రక్షించే ఘటనలు.. చాలా అరుదుగా జరుగుతూ ఉంటాయి. ప్రస్తుతం అలాంటి వీడియో ఒకటి వైరల్ అవుతోంది. నీటిలో పడిపోతున్న బాలుడిని వారి పెంపుడు కుక్క గమనించింది. చివరికి ఏం చేసిందంటే..
సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్ అవుతోంది. ఓ ఇంటి ఆవరణలోని పార్కింగ్ స్థలంలో ఉన్న నీటి పౌంటేన్ వద్ద ఇద్దరు పిల్లలు బంతితో ఆడుకుంటూ ఉంటారు. ఈ క్రమంలో బంతి వెళ్లి నీటిలో పడుతుంది. దాన్ని తీసేందుకు బాలుడు అక్కడికి వెళ్తాడు. నీటిలో చేయి పెట్టి తీసే క్రమంలో అందులో పడిపోతాడేమో అనిపిస్తుంది. అక్కడే ఉన్న వారి పెంపుడు కుక్క ఇదంతా గమనిస్తూ ఉంటుంది. వెంటనే అక్కడికి వెళ్లి.. బాలుడి చొక్కాను నోటితో పట్టుకుని పక్కకు లాగుతుంది. తర్వాత ఓ నెట్‌తో కూడిన కర్రను నోట కరుచుకుని వెళ్లి.. సొంతంగా బంతిని బయటికి తీస్తుంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు కుక్కను తెగ అభినందిస్తున్నారు. చిన్న పిల్లలు ఉన్న ఇళ్లల్లో ఇలాంటి కుక్కలు ఉంటే ఎంతో ప్రయోజనకరంగా ఉంటుందని కామెంట్లు పెడుతున్నారు.
ఇవి కూడా చదవండి