Viral Video: తల్లి ప్రేమను అర్థం చేసుకోమంటూ.. కొడుక్కి ఈ కుక్క ఎంత బాగా చెప్పింది... మీరే చూడండి..

ABN , First Publish Date - 2022-02-12T01:25:52+05:30 IST

ఓ తల్లి తన కొడుక్కి కొసరి కొసరి వడ్డిస్తూ ఉంటుంది. కానీ కొడుకు మాత్రం చిరాకుగా తల్లి ఇచ్చిన ఆహారాన్ని నేల మీద పడేస్తాడు. దీంతో వారి పక్కనే ఉన్న కుక్క ఇదంతా గమనిస్తూ.. ఏం చేస్తుందంటే...

Viral Video: తల్లి ప్రేమను అర్థం చేసుకోమంటూ.. కొడుక్కి ఈ కుక్క ఎంత బాగా చెప్పింది... మీరే చూడండి..

మనుషుల కంటే జంతువులే నయమని ఒక్కోసారి పెద్దలు అంటూ ఉంటారు. మిగతా జీవరాశి కంటే ఎంతో తెలివైన మానవులు.. క్రమక్రమంగా దిగజారిపోతున్నారు. డబ్బుకు ఇచ్చినంత విలువ సాటి మనిషికి ఇవ్వడం లేదు. వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రులను జాగ్రత్తగా చూసుకునే కొడుకులను వేళ్ల మీద లెక్కపెట్టవచ్చు. అయితే తల్లిదండ్రుల మీద కొడుకులకు ప్రేమ లేకపోయినా వారికి మాత్రం వీరి మీద ఎంతో ప్రేమ ఉంటుంది. కొడుకు ఒక పూట పస్తులున్నా తట్టుకోలేరు. ఇదంతా ఇప్పుడు ఎందుకు చెప్తున్నామంటే.. ఓ తల్లి తన కొడుక్కి కొసరి కొసరి వడ్డిస్తూ ఉంటుంది. కానీ కొడుకు మాత్రం చిరాకుగా తల్లి ఇచ్చిన ఆహారాన్ని నేల మీద పడేస్తాడు. దీంతో వారి పక్కనే ఉన్న కుక్క ఇదంతా గమనిస్తూ.. ఏం చేస్తుందంటే..


కుక్కలకు ఉన్న విశ్వాసం మనుషులకు కూడా ఉండదంటారు. ఈ వీడియోలో ఓ కుక్క చేసిన పని తెలిస్తే.. మరోసారి ఈ మాట నిజమని మీరే అంటారు. ఇన్‌స్టాగ్రామ్‌లో వైరల్ అవుతున్న ఓ వీడియోలో తల్లి తన కొడుక్కి ప్రేమతో భోజనం పెడుతుంది. ఈ క్రమంలో ఆకుకూరలు తినమంటూ భోజనంలో వేస్తుంది. దీంతో అతడు చిరాకుగా వాటిని కింద పడేస్తాడు. పక్కనే ఉన్న వారి పెంపుడు కుక్క ఇదంతా గమనిస్తుంది. యువకుడిని కాలితో తట్టి.. తల్లి ప్రేమతో పెడితే అలా కింద వేయొచ్చా.. అన్నట్లుగా రియాక్షన్ ఇస్తుంది. కింద పడేసిన ఆకుకూరలను మళ్లీ తీసుకునే వరకూ అతన్ని వదలదు. కింద ఉన్న ఆకుకూరలను తీసుకుని భోజనంలోకి వేసుకోగానే.. ‘‘ఇది పద్ధతి!’’ అన్నట్లు ఆ కుక్క ప్రవర్తించడం నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటోంది. ఈ వీడియోపై మీరూ ఓ లుక్కేయండి మరి.

6 అడుగుల స్థలంలో 4 అంతస్థుల భవనం.. కిచెన్ నుంచి బెడ్రూం వరకు సకల సౌకర్యాలు.. ఇల్లు చూస్తే నోరెళ్లబెట్టాల్సిందే..!





Updated Date - 2022-02-12T01:25:52+05:30 IST