అప్పట్లో గంగ్నం స్టైల్ డ్యాన్స్.. ఇప్పుడు కొక్కొరొకో డ్యాన్స్.. వైరల్ అవుతున్న వీడియో..

ABN , First Publish Date - 2021-12-12T22:56:39+05:30 IST

సాధారణంగా ఎద్దులు, ఏనుగులు, కుక్కలు, కోతులు తదితర జంతువులు యజమాని చెప్పినట్లు చేయడం చూస్తుంటాం. ఈ వీడియోలో మూడు కోళ్లు.. యజమాని చెప్పినట్లుగా చేయడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తుంది..

అప్పట్లో గంగ్నం స్టైల్ డ్యాన్స్.. ఇప్పుడు కొక్కొరొకో డ్యాన్స్.. వైరల్ అవుతున్న వీడియో..

సోషల్ మీడియా పూర్తి స్థాయిలో అందుబాటులోకి రాని రోజుల్లోనే గంగ్నం స్టైల్ డ్యాన్స్.. ఎంత సంచలనం సృష్టించిందో అందరికీ తెలుసు. ప్రస్తుతం అందరి చేతిలోకి స్మార్ట్ ఫోన్ వచ్చింది. దీంతో, కాస్త వినూత్నంగా ఉన్న వీడియోలు కూడా తెగ వైరల్ అవుతున్నాయి. అలాంటి వీడియో ఒకటి ప్రస్తుతం నెట్టింట సందడి చేస్తోంది. సాధారణంగా ఎద్దులు, ఏనుగులు, కుక్కలు, కోతులు తదితర జంతువులు యజమాని చెప్పినట్లు చేయడం చూస్తుంటాం. ఈ వీడియోలో మూడు కోళ్లు.. యజమాని చెప్పినట్లుగా చేయడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తుంది.


ఈ వీడియోలో ఓ వ్యక్తి డ్యాన్స్ చేస్తూ నడుస్తూ ఉండడం చూడొచ్చు. అయితే అక్కడే ఉన్న మూడు కోళ్లు కూడా తమ యజమానిని అనుసరిస్తాయి. రెండు కోళ్లు అతడి రెండు చేతులపైకి ఎగిరి నిల్చుంటే.. మరో కోడి, అతడి కాళ్ల మధ్యలో లయబద్ధంగా అటూ, ఇటూ కదలడం చూడముచ్చటగా ఉంటుంది. డ్యాన్స్‌‌లో ట్రైనింగ్ తీసుకున్నట్లుగా ఆ కోళ్లు వ్యవహరించడం.. నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటోంది. ఈ వీడియో చూసిన వారంతా కోళ్లు డ్యాన్స్ చేయడం చాలా వెరైటీగా ఉందంటూ కామెంట్లు పెడుతున్నారు. ఆలస్యమెందుకూ.. మీరూ ఓ లుక్కేయండి.

మా కుక్కను ఎందుకు కొడుతున్నారు.. అని యువతి అన్నందుకు.. అర్ధరాత్రి అందరి ముందే ఆ ఆకతాయిలు చేసిన పని..



Updated Date - 2021-12-12T22:56:39+05:30 IST