వివాహ వేడుకల్లో డప్పు వాయిద్యాలకు తీన్మార్ డ్యాన్సులు వేయడం సాధారణమే. అయితే కొన్ని వివాహ వేడుకల్లో యువతీయవకుల అల్లరి అంతాఇంతా కాదు. ఇక చాలా తక్కువ సందర్భాల్లో మాత్రమే వధూవరులు కూడా ఉత్సాహంగా చిందులు వేస్తూ ఉల్లాసంగా కనిపిస్తారు. ఎక్కువ శాతం వధువులు మాత్రం సిగ్గు, బిడియంతోనే ఉంటారు. కాకపోతే కొందరు పెళ్లికుమార్తెలు మాత్రం అందరినీ ఆశ్చర్యపరుస్తూ చిందులు వేస్తుంటారు. అలాంటి వీడియోలు సోషల్ మీడియాలో ఎన్నో వైరల్ అవుతుంటాయి. ఇప్పుడు మనం చూడబోయేది కూడా ఇలాంటిదే. అయితే ఈ వీడియోలో వధువు మాత్రం చాలా స్పెషల్ అసలే సెలబ్రిటీ కావడంతో ఆమె వేసిన స్టెప్పులకు వరుడు కూడా సిగ్గుపడ్డాడు.
‘విట్టీ_వెడ్డింగ్’ అనే ఇన్స్టాగ్రాం ఖాతాలో ఈ వీడియోను పోస్టు చేశారు. వివాహ వేదికపై వధూవరులు ఇద్దరూ నిలబడి ఉంటారు. ఇంతలో ఓ హింది పాట ప్లే అవుతుంది. ఇంకేముందీ.. అప్పటిదాకా సైలెంట్‌గా ఉన్న వధువు.. ఒక్కసారిగా కాలు కదుపుతుంది. ఆమె వేసిన వేసిన స్టెప్పులకు పక్కనే నిల్చుని ఉన్న వరుడు సిగ్గు పడుతుంటాడు. అయినా వధువు మాత్రం ఏమాత్రం తగ్గకుండా ఉల్లాసంగా డ్యాన్సు వేస్తుంది. ఇక్కడ విశేషం ఏంటంటే.. వధువు అన్షుల్ చౌహాన్ పలు హిందీ చిత్రాల్లో నటించడంతో మంచి ఫాలోయింగ్ ఉంది. ఈమె జీరో (2018), బిచ్చూ కా ఖేల్ (2020), శుభ్ మంగళ్ సావధాన్ (2017) వంటి సినిమాల్లో నటించి మంచి పేరు తెచ్చుకుంది. దీంతో ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.
ఇవి కూడా చదవండి