Viral Video: పెళ్లిలో దండలు మార్చుకుంటారని తెలుసు గానీ.. మరీ ఇలా మార్చుకుంటారని.. ఎవ్వరూ ఊహించి ఉండరు..

ABN , First Publish Date - 2022-02-26T01:13:52+05:30 IST

పెళ్లిలో వధూవరులు దండలు మార్చుకోవడం మామూలే. కానీ ఇప్పుడు మనం చూడబోయే వీడియోలో వధూవరులు చిత్ర విచిత్రంగా దండలు మార్చుకున్నారు..

Viral Video: పెళ్లిలో దండలు మార్చుకుంటారని తెలుసు గానీ.. మరీ ఇలా మార్చుకుంటారని.. ఎవ్వరూ ఊహించి ఉండరు..

వివాహ కార్యక్రమంలో తమాషా సంఘటనలు జరుగుతూ ఉంటాయి. కొన్ని జీవితాంతం గుర్తుంచుకోవాల్సిన మధుర జ్ఞాపకాలుగా నిలిచిపోతుంటాయి. పెళ్లి అంటేనే బంధువుల హడావుడి, స్నేహితుల అల్లరితో సందడి సందడిగా ఉంటుంది. ఈ క్రమంలో కొన్ని సరదా సరదా సంఘటనలు చోటు చేసుకుంటూ ఉంటాయి. ఇలాంటి వీడియోలు సోషల్ మీడియాలో ఇటీవల చాలా చూశాం. ప్రస్తుతం వైరల్ అవుతున్న ఓ వీడియో కూడా ఈ కోవకే చెందుతుంది. పెళ్లిలో వధూవరులు దండలు మార్చుకోవడం మామూలే. కానీ ఇప్పుడు మనం చూడబోయే వీడియోలో వధూవరులు చిత్ర విచిత్రంగా దండలు మార్చుకున్నారు.


ఇన్‌స్టాగ్రాంలో వైరల్ అవుతున్న వీడియోలో పెళ్లి మండపంపై వధూవరులు దండలు మార్చుకునేందుకు సిద్ధంగా ఉంటారు. అయితే తీరా వారు దండలు మార్చుకునే సమయంలో వధూవరుల తరపు బంధువులు వారి చుట్టూ చేరారు. కొందరు వరుడిని, మరికొందరు వధువును పైకి ఎత్తుకున్నారు. తర్వాత ముందుగా వధువు మెడలో వరుడు దండ వేశాడు. తర్వాత వధువు వంతు వచ్చింది. అయితే ఆమె మాత్రం దండ వేసేందుకు చాలా ఇబ్బంది పడింది. అయితే చివరకి ఎలాగోలా వరుడి మెడలో దండ వేసేసింది. దీంతో అక్కడున్న వారంతా కేకలు వేస్తూ సంతోషం వ్యక్తం చేశారు. ఈ వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది. ఈ వధూవరులు దండలు మార్చుకోవడం.. చాలా విచిత్రంగా ఉందంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. 

 కూతురికి త్వరగా పెళ్లి జరిగేలా పూజలు చేయమంటే.. తల్లీ, కూతుళ్లకు నీళ్లిచ్చిన నకిలీ బాబా.. మరుక్షణమే..





Updated Date - 2022-02-26T01:13:52+05:30 IST