Abn logo
Dec 5 2020 @ 03:51AM

ముగ్గురు ముస్లిమేతరుల గెలుపు

మజ్లిస్‌ పార్టీ ఈసారి క్లీన్‌చిట్‌, యువతకే టికెట్లు ఇచ్చింది. నలుగురు ముస్లిమేతరులకు టికెట్లు ఇచ్చి ముగ్గురిని గెలిపించుకుంది. పురానాపుల్‌ నుంచి సున్నం రాజ్‌మోహన్‌, కార్వాన్‌ నుంచి మందగిరి స్వామి యాదవ్‌, ఫలక్‌నుమా నుంచి తారాబాయి గెలిచారు.

రాజ్‌మోహన్‌, తారాబాయి గతంలోనూ కార్పొరేటర్లే. జాంబాగ్‌ నుంచి డి.మోహన్‌ స్థానంలో జడల రవీంద్రకు ఎంఐఎం టికెట్‌ ఇవ్వడంతో ఓడిపోయింది. కొందరు పాత అభ్యర్థులను డివిజన్లు మార్చి గెలిపించుకుంది. 


Advertisement
Advertisement
Advertisement