రేషన్‌కార్డుల పరిశీలన ప్రక్రియ త్వరగా పూర్తి చేయాలి

ABN , First Publish Date - 2021-06-19T06:31:03+05:30 IST

రేషన్‌ కార్డు దరఖాస్తుల పరిశీలన ప్రక్రియ త్వరితగతిన పూర్తి చేయాలని పౌర సరఫరాలశాఖ మంత్రి గంగుల కమలాకర్‌ శుక్రవారం కరీంనగర్‌ నుండి వీడియో కన్ఫరెన్స్‌ ద్వారా అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు.

రేషన్‌కార్డుల పరిశీలన ప్రక్రియ త్వరగా పూర్తి చేయాలి
మంత్రి వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడుతున్న కలెక్టర్‌

వీసీలో మంత్రి గంగుల కమలాకర్‌

నిర్మల్‌ టౌన్‌, జూన్‌ 18 : రేషన్‌ కార్డు దరఖాస్తుల పరిశీలన ప్రక్రియ త్వరితగతిన పూర్తి చేయాలని పౌర సరఫరాలశాఖ మంత్రి గంగుల కమలాకర్‌ శుక్రవారం కరీంనగర్‌ నుండి వీడియో కన్ఫరెన్స్‌ ద్వారా అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ... రేషన్‌కార్డు దరఖాస్తుల పరిశీలన త్వరగా పూర్తి చేసి అర్హులైన వారందరికీ రేషన్‌కార్డులు మంజూరు చేయాలని అన్నారు. రేషన్‌కార్డుల మంజూరు, రబీధాన్యం సేకరణపై సమీక్ష నిర్వహించారు. రేషన్‌కార్డుల జారీపై రాష్ట్ర కేబి నెట్‌ సబ్‌కమిటీ సూచించిన విధంగా పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులను త్వరగా పరిశీలించి జాబితాను వారంలోగా పంపాలని, లబ్ధిదారుల వివరాలను క్షేత్ర స్థాయిలో రెవెన్యూ, మున్సిపల్‌ సిబ్బందితో పరిశీలన జరిపి అర్హులైన వారి జాబితాను పంపించాలని ఆదేశించారు. దరఖాస్తు చేసుకున్న అద్దెఇళ్లల్లో ఉన్నవారు. వేరే ఇళ్లకు మారిన వారిని గుర్తించి వారికి ఉన్నచోట రేషన్‌కార్డు మంజూరు చేయుటకు చర్యలు తీసుకోవాలన్నారు. వరిధాన్యం కొనుగోలు ముందుగానే పూర్తి చేసినందుకు ధన్యవాదాలు తెలిపారు. జిల్లా పాలనాధికారి ముషారఫ్‌ ఫారూఖీ మాట్లాడుతూ... జిల్లాలో రేషన్‌కార్డుల కొరకు 7,599 దరఖాస్తులు వచ్చాయని, వీటినిలో 3,544 దరఖాస్తులు పరిశీలించామన్నారు. మిగితా 3,965 మూడురోజుల్లో పూర్తి చేస్తామన్నారు. 40 వేల 434 మంది రైతుల నుండి 1,88,986 మెట్రిక్‌ టన్నుల ధాన్యం కొనుగోలు చేశామన్నారు. ఈ రోజు వరకు 239.68 కోట్ల రూపాయలు రైతులకు ఇచ్చామని తెలిపారు. వీడియో కాన్ఫరెన్స్‌లో అదనపు కలెక్టర్‌ పి. రాంబాబు, పౌరసరఫరాలశాఖ అధికారి కిరణ్‌కుమార్‌, తదితరులు పాల్గొన్నారు. 


Updated Date - 2021-06-19T06:31:03+05:30 IST