Advertisement
Advertisement
Abn logo
Advertisement

కరోనా నుంచి రక్షణకు వ్యాక్సినే మార్గం

వికారాబాద్‌/కీసర/కులకచర్ల/శామీర్‌పేట: కరోనా నుంచి రక్షణకు వ్యాక్సిన్‌ ఒక్కటే మార్గం అని వికారాబాద్‌ మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ చిగుళ్లపల్లి మంజుల అన్నారు. బుధవారం ఆలంపల్లి, బాల భవన్‌లో వ్యాక్సినేషన్‌ ప్రక్రియను ఆమె పర్యవేక్షించారు. కొవిడ్‌ నుంచి మనల్ని కాపాడుకోవాలి అంటే వ్యాక్సినేషన్‌ తీసుకోవడం తప్పనిసరి అని అన్నారు. 18సంవత్సరాలు నిండిన ప్రతీ ఒక్కరు రెండు డోస్‌ల టీకా వేసుకోవాలని ప్రజలను కోరారు. మున్సిపల్‌ కమిషనర్‌, కౌన్సిలర్‌ రామస్వామి, మాజీ వైస్‌చైర్మన్‌ రమే్‌షకుమార్‌, సురే్‌షగౌడ్‌, శానిటేషన్‌ ఇన్‌స్పెక్టర్‌ నాగరాజు, ఆశా వర్కర్లు పాల్గొన్నారు. బీజేపీ కిసాన్‌ మోర్చా ప్రధాన కార్యదర్శి  కృష్ణ అధ్వర్యంలో కీసర మండలం భోగారంలోని ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు మాస్కులు పంపిణీ చేశారు. కిసాన్‌ మోర్చా మండల ప్రధాన కార్యదర్శి గన్నేర్ల మఽధుసూధన్‌, మల్లేష్‌, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. కులకచర్ల మండలంలో వందశాతం వ్యాక్సినేషన్‌ చేయాలని తహసీల్దార్‌ శ్రీనివా్‌సరావు అన్నారు. రాంనగర్‌ జీపీ గోప్యనాయక్‌ తండాలో వ్యాక్సినేషన్‌ను పరిశీలించారు. ఇంటింటికీ తిరిగి టీకా వేసుకోని వారికి టీకా వేయాలని ఆరోగ్య సిబ్బంది సూచించారు. ఆర్‌ఐ రవికిషోర్‌, అంగన్‌వాడీ టీచర్‌ మల్లమ్మ, ఆరోగ్య సిబ్బంది పాల్గొన్నారు. తూంకుంట మున్సిపాలిటీ దేవరయంజాల్‌, తూంకుంట ఉన్నత పాఠశాలల్లో 500మంది విద్యార్థులకు తూంకుంట వాసి మోహిత్‌ సతీమణి అనూష జన్మదిన సందర్భంగా శానిటైజర్లు, మాస్కులు అందజేశారు. అనూష దంపతులను హెచ్‌ఎంలు, ప్రజా ప్రతినిధులు అభినందించారు. ఈ కార్యక్రమంలో తూంకుంట మున్సిపాలిటీ కౌన్సిలర్‌ రాజుయాదవ్‌, కోఆప్షన్‌ సభ్యుడు శ్రీధర్‌రెడ్డి, తూంకుంట కాంగ్రెస్‌ అధ్యక్షుడు జైపాల్‌రెడ్డి, ఇన్‌చార్జి హెచ్‌ఎం వెంకటేశం, దేవరయంజాల్‌ హెచ్‌ఎం స్వరూపారాణి, నాయకులు గట్టు ప్రణయ్‌కుమార్‌, టీచర్‌ నర్సింహారెడ్డి, గ్రామస్తులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement