పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి

ABN , First Publish Date - 2021-06-17T06:15:58+05:30 IST

తెలంగాణ రాష్ట్రంలో ప్రతిష్టాత్మకంగా చేపట్టి నిర్వహిస్తున్న పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని జిల్లా పాలనాధికారి ముషారఫ్‌ ఫారూ ఖీ అన్నారు.

పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి
సమావేశంలో మాట్లాడుతున్న కలెక్టర్‌ ముషారఫ్‌ ఫారూఖీ

నిర్మల్‌ టౌన్‌, జూన్‌ 16 : తెలంగాణ రాష్ట్రంలో ప్రతిష్టాత్మకంగా చేపట్టి నిర్వహిస్తున్న పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని జిల్లా పాలనాధికారి ముషారఫ్‌ ఫారూ ఖీ అన్నారు. బుధవారం జిల్లా పాలనాధికారి సమావేశ మందిరంలో పట్టణ ప్రగతి కార్యక్రమంపై మున్సిపల్‌ సిబ్బందితో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా పాలనాధికారి మాట్లాడుతూ గత ఏడాది చక్కని ఫలితాలు సాధించినట్లుగా అదేస్ఫూర్తితో మరింత కష్ట పడి ఈసారి కూడా పట్టణ ప్రగతిని విజయవంతం చే యాలని అన్నారు. గ్రామాల్లో ముఖ్యంగా పచ్చదనం, పరిశుభ్రత ఈ రెండింటి మీదే దృష్టి సారిచాలని, ఎప్ప టికప్పుడు చనిపోయిన మొక్కలస్థానంలో పెద్ద మొక్క లు నాటే విధంగా చూడాలని, రోడ్లకు ఇరువైపులా మొ క్కలను నాటాలని తెలిపారు. పరిశుభ్రతలో భాగంగా చెత్త సేకరణ రోజు వారీగా జరగాలని, ప్రతి గ్రామానికి ట్రాక్టర్‌, ట్రాలీలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. మోడల్‌ మార్కెట్‌, డంపింగ్‌యార్డ్‌, క్రిమిటోరియం ని ర్మాణ పనులు జూలై చివరి నాటికి పూర్తి చేయాలని ఆ దేశించారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు హరితహా రంలో భాగ ంగా రెవెన్యూ ప్లాంటేషన్‌లు భారీ ఎత్తున ర హదారుల వెంబడి విస్తృతంగా నాటి వారంలోగా పూర్తి చేయాలన్నారు. వానాకాలం సీజనల్‌ వ్యాధులు వచ్చే అవకాశం ఉన్నందున ఆరోగ్యశాఖ అధికారులతో సమన్వ యం చేసుకొని క్లోరినేషన్‌ను, పరిసరాల పరిశుభ్రతకు తగినచర్యలు తీసుకోవాలన్నారు. ప్రతీ శుక్రవారం డ్రై డేను ఉదయం 9 గంటలకు, ఆదివారం ఉదయం 10:10 నిమిషాలకు నిర్వహించాలని, ఇందులో ప్రజా ప్రతినిధు లు పాల్గొనేలా చూడాలని అన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్‌ హేమంత్‌, మున్సిపల్‌ చైర్మన్‌ ఈశ్వర్‌, నిర్మల్‌, భైంసా, ఖానాపూర్‌ మున్సిపల్‌ కమిషనర్‌లు, తదితరులు పాల్గొన్నారు. 

హరితహారంలో  లక్ష్యం పూర్తి చేయాలి

హరితహారంలో భాగంగా జిల్లా పాలనాధికారి సమా వేశ మందిరంలో బుధవారం అన్ని శాఖల జిల్లా అధికారులతో సమావేశం నిర్వహించా రు. ఈ సందర్భంగా జిల్లా పాలనాధికారి ము షారఫ్‌ ఫారూఖీ మాట్లాడుతూ ఆయా శాఖల అధికారులకు ఇచ్చిన లక్ష్యాన్ని వందశాతం పూర్తి చేయాలని ఆదేశించారు. మన జిల్లా టార్గెట్‌ మొత్తం 65 లక్షలు కాగా డీఆర్డీఏ 21 లక్షలు, అటవీశాఖ 12 లక్షలు, మిగితా ఆయా శాఖలకు టార్గెట్‌ ఇచ్చామన్నారు. ప్రతీశాఖకు ఇచ్చిన టార్గెట్‌ వందశాతం పూర్తి చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో అటవీశాఖ అధి కారి వికాస్‌మీనా, అదనపు కలెక్టర్‌ హేమంత్‌, జిల్లా అధికారులు, తదితరులు పాల్గొన్నారు. 

భూ సమస్యలను త్వరగా పరిష్కరించాలి

ధరణిలో వచ్చిన భూ సమస్యలను త్వరిత గతిన పరిష్కరించాలని తహసీల్దార్‌లను ఆదే శించారు. బుధవారం జిల్లా పాలనాధికారి స మావేశం మందిరంలో ఏర్పాటు చేసిన సమా వేశంలో జిల్లా పాలనాధికారి ముషారఫ్‌ ఫా రూఖీ మాట్లాడుతూ పట్టామార్పిడి, వారసత్వ భూముల మార్పిడి, తదితర వాటిని ఎలాంటి అలసత్వం లేకుండా పరిశీలన చేసి పంపా లని జిల్లా పాలనాధికారి తహసీల్దార్‌లను ఆదేశించారు. మండలాల వారీగా పెండింగ్‌లో ఉన్న దరఖాస్తుల వివరాలను అడిగి తెలుసు కున్నారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్‌ పి.రాం బాబు, తహసీల్దార్‌లు, తదితరులు పాల్గొన్నారు. 

డీఆర్‌డీవో విందు వివాదాస్పదం

నిబంధనలు పాటించలేదంటున్న విమర్శలు

సారంగాపూర్‌, జూన్‌ 16 : నిర్మల్‌ జిల్లా డీఆర్‌డీవో వెంకటేశ్వర్లు బదిలీ సందర్భంగా ఇచ్చిన విందు వివాదాస్పదమైంది. ఇదే అం శం సోషల్‌మీడియాలో చెక్కర్లు కొడుతోంది. మంగళవారం సారంగాపూర్‌ మండలంలోని ఆడెల్లి మహాపోచమ్మ దేవాలయం సమీపంలో విందు ఏర్పాటు చేశారు.  జిల్లా కలెక్టర్‌ ము షారఫ్‌ ఫారూఖీ అలీతో పాటు ఆయా శాఖల అధికారులు కొవిడ్‌- 19 నిబంధనలను ఉల్లంఘించి విందులో పాల్గొన్నారన్న విమర్శలు వస్తున్నాయి. నిబంధనలన్నీ సామాన్యులకేనా అని చర్చించుకుంటున్నారు. 


Updated Date - 2021-06-17T06:15:58+05:30 IST