వచ్చే ఎన్నికలు రాష్ట్ర భవితకు కీలకం

ABN , First Publish Date - 2022-06-26T05:40:14+05:30 IST

వచ్చే సార్వత్రిక ఎన్నికలే ఆంధ్రప్ర దేశ్‌ రాష్ట్ర భవిష్యత్‌కు దిశానిర్ధేశమని టీడీపీ బాపట్ల పార్ల మెంట్‌ అధ్యక్షుడు, ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు పేర్కొ న్నారు.

వచ్చే ఎన్నికలు రాష్ట్ర భవితకు కీలకం
డల్లాస్‌లో ఎన్‌ఆర్‌ఐలతో కేక్‌ కట్‌చేస్తున్న ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు

 చంద్రబాబుతోనే పునర్నిర్మాణం

 ఎన్‌ఆర్‌ఐలు కీలకంగా వ్యవహరించాలి

 ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు

పర్చూరు, జూన్‌ 25: వచ్చే సార్వత్రిక ఎన్నికలే ఆంధ్రప్ర దేశ్‌ రాష్ట్ర భవిష్యత్‌కు దిశానిర్ధేశమని టీడీపీ బాపట్ల పార్ల మెంట్‌ అధ్యక్షుడు, ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు పేర్కొ న్నారు.   ప్రజల చేతుల్లోనే రాష్ట్ర భవిష్యత్‌ ఉందని చెప్పా రు. అమెరికాలోని టెక్సాస్‌ రాష్ట్రం డల్లాస్‌ నగరంలోని మైత్రి ఫంక్షన్‌ హాల్‌లో శనివారం జరిగిన టీడీపీ ఎన్‌ఆర్‌ఐల ఆత్మీయ సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. పార్టీ వ్యవస్థాపకులు ఎన్టీ రామారావు జయంతి ఉత్సవాల సందర్భంగా ఏలూరి కేక్‌ కట్‌చేశారు. ఈ సందర్భంగా జరిగిన సభలో ఏలూరి మాట్లాడుతూ రాష్ట్ర విభజన అనంతరం అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అభివృద్ధి, సంక్షేమానికి ప్రాఽధాన్యత ఇచ్చి అన్నిరంగాలను అభివృద్ధి వైపు నడిపారన్నారు. అభివృద్ధి వైపు పరుగులు తీస్తున్న రాష్ట్రాన్ని  ప్రజలు వైసీపీకి అప్పగించారని, ఈ మూడేళ్ళలో రాష్ట్రం అధోగతి పాలైందన్నారు. రాష్ట్రంలో అభివృద్ధి లేక పోగా, ఉన్న పరిశ్రమలు వెనక్కిపోతున్నాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి ప్రజావేదికను కూల్చి విధ్వంసక పాలన చేస్తున్నారని మండిపడ్డారు. 

రాష్ట్రం పునర్నిర్మాణం, అభివృద్ధి కోసం చంద్రబాబు మళ్ళీ ముఖ్య మంత్రి కావాలన్నారు. అందుకోసం ప్రజలంతా సిద్ధంగా ఉన్నారన్నారు. రానున్న రోజుల్లో ఎన్‌ఆర్‌ఐల పాత్ర కీలకమన్నారు. ఎమ్మెల్యే రాకతో డల్లాస్‌ తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో భారీ వాహన ర్యాలీ నిర్వ హించారు. 

Updated Date - 2022-06-26T05:40:14+05:30 IST