అల్లుడిని చంపిన మామ

ABN , First Publish Date - 2021-03-19T14:51:48+05:30 IST

జిల్లాలో దారుణం జరిగింది. పెందుర్తి

అల్లుడిని చంపిన మామ

విశాఖ: జిల్లాలో దారుణం జరిగింది. పెందుర్తి మండలంలోని చినముషిడివాడలో అల్లుడిని మామ కొట్టి చంపాడు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం మామ శంకర్‌, అల్లుడు చిన్నా మధ్య మద్యం మత్తులో ఘర్షణ చోటుచేసుకుంది. కోపోద్రేకంలో రాడ్‌తో కొట్టి అల్లుడు చిన్నను మామ శంకర్‌ హత్య చేశాడు. నిందితుడు శంకర్‌, బావమరిది అశోక్‌లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 

Updated Date - 2021-03-19T14:51:48+05:30 IST