Abn logo
Jul 25 2021 @ 01:56AM

రెండేళ్ల సహకారం మరువలేనిది

గవర్నర్‌ విశ్వ భూషణ్‌ హరిచందన్‌


అమరావతి, జూలై 24(ఆంధ్రజ్యోతి): ఆంధ్రప్రదేశ్‌ గవర్నర్‌గా రెండేళ్లు పూర్తి చేసుకోవడం ఎంతో ఆనందంగా ఉందని గవర్నర్‌ విశ్వ భూషణ్‌ హరిచందన్‌ అన్నారు. రాష్ట్ర ప్రథమ పౌరునిగా బాధ్యతలు స్వీకరించి రెండేళ్లయిన సందర్భంగా గవర్నర్‌ హరిచందన్‌, సుప్రవ హరిచందన్‌ దంపతులు రాజ్‌భవన్‌ ప్రాంగణంలో శనివారం మొక్కలు నాటారు. గవర్నర్‌ మాట్లాడుతూ రెండేళ్లుగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి, రాజ్‌భవన్‌ బృందం నుంచి తనకు మంచి సహకారం లభించిందని ఆనందం వ్యక్తంచేశారు. గవర్నర్‌ దంపతులకు సంయుక్త కార్యదర్శి ఎ.శ్యామ్‌ ప్రసాద్‌, రాజ్‌భవన్‌ అధికారులు, సిబ్బందితోపాటు.. ఇండియన్‌ రెడ్‌క్రాస్‌ సోసైటీ రాష్ట్ర శాఖ చైర్మన్‌ డాక్టర్‌ ఎ.శ్రీధర్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి పరిదా తదితరులు శుభాకాంక్షలు తెలిపారు.