Abn logo
Sep 24 2021 @ 00:52AM

రాష్ట్రంలో తిరుగులేని శక్తిగా టీఆర్‌ఎస్‌ పార్టీ

సమావేశంలో మాట్లాడుతున్న బస్వరాజు సారయ్య

రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బస్వరాజు సారయ్య

రాయికల్‌, సెప్టెంబరు 23: రాష్ట్రంలో తిరుగులేని శక్తిగా టీఆర్‌ఎస్‌ పార్టీ బలపడిందని ఆపార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బస్వరాజు సారయ్య అన్నారు. గురువారం రాయికల్‌ పట్టణంలో గుడేటి రెడ్డి సంఘంలో పార్టీ గ్రామ వార్డు, పట్టణ, మండల కార్యవర్గ సభ్యుల సమ్మేళనం జరి గింది. ఈసమావేశంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ కార్యకర్తలు పా ర్టీలో కష్టపడి పనిచేయాలని వారికి ఎప్పుడూ గుర్తింపు ఉంటుందని అ న్నారు. పదవులు రానివారికి భవిష్యత్తులో మరిన్ని పదవులు వస్తాయని ఎవరూ నిరాశ పడవద్దని అన్నారు. రాష్ట్రంలో టీఆర్‌ఎస్‌ పార్టీకి పోటీలే దని సభ్యత్వంలో టీఆర్‌ఎస్‌ అగ్రస్థానంలో ఉందని అన్నారు. ఎమ్మెల్యే డాక్టర్‌ సంజయ్‌ మాట్లాడుతూ గతంలో పార్టీ తరపున పోటీచేయడానికి అభ్యర్థుల కొరత ఉండేదని నేడు ప్రతీ గ్రామంలో, వార్డుల్లో, మున్సిపల్‌, ఎంపీపీ, జడ్పీటీసీ చైర్మన్‌లను కైవసం చేసుకునే స్థాయికి చేరిందని నాకు సహకరించిన ప్రతీ ఒక్కరికి ధన్మవాదాలు తెలిపారు. ఈకార్యక్ర మంలో పార్టీ మండల, పట్టణ అధ్యక్షులు కోల శ్రీనివాస్‌, ఇంతియాజ్‌, మున్సిపల్‌ చైర్మన్‌ మోర హన్మాండ్లు, ఎంపీపీ లావుడ్య సంధ్యారాణి, జడ్పీటీసీ అశ్విని, మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ గన్నెరాజరెడ్డి,  వివిధ గ్రా మాల ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు పాల్గొన్నారు.