ఇంటింటా మువ్వన్నెల జెండా ఎగరాలి

ABN , First Publish Date - 2022-08-11T04:48:33+05:30 IST

స్వతంత్ర భారత వజ్రోత్సవాల్లో భాగంగా ప్రతీ ఇంటిపై మువ్వన్నెల జెండా ఎగరాలని కలెక్టర్‌ హరిచందన కోరారు.

ఇంటింటా మువ్వన్నెల జెండా ఎగరాలి
నర్వలో ఏర్పాటు చేసిన వజ్రోత్సవాల చిహ్నం

- కలెక్టర్‌ హరిచందన

- మొక్కలు నాటిన కలెక్టర్‌, అధికారులు, ప్రజాప్రతినిధులు

ధన్వాడ, ఆగస్టు 10 : స్వతంత్ర భారత వజ్రోత్సవాల్లో భాగంగా ప్రతీ ఇంటిపై మువ్వన్నెల జెండా ఎగరాలని కలెక్టర్‌ హరిచందన కోరారు. ఆజాదికా అమృత్‌ మహోత్సవ్‌లో భాగంగా కలెక్టర్‌ మండలంలోని మందిపల్లి పల్లె ప్రకృతి వనాన్ని సందర్శించి మొక్కలు నాటారు. పోలీస్‌ శాఖ ఆధ్వర్యంలో గురువారం నిర్వహించే ఫ్రీడం రన్‌లో అధికారులు, ప్రజాపత్రినిధులు పాల్గొన్నాలన్నారు. అదే విధంగా ధన్వాడలో పంచాయతీ ఆధ్వర్యంలో కస్తూర్బా గురుకుల పాఠశాల వద్ద 75 సంవత్సరాలు సూచించే విధంగా మొక్కల తో ఏర్పాటు చేశారు. డీఆర్డీవో గోపాల్‌నాయక్‌, ఎంపీడీవో సద్గుణ పాల్గొన్నారు.

నారాయణపేట : నారాయణపేట 5వ వార్డులో పురపాలక ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఫ్రీడం పార్కులో  బుధవారం 750 మొక్కలను 75 ఆకారంలో మొక్కలు నాటారు. ఎస్పీ వెంకటేశ్వర్లు, పుర చైర్‌ పర్సన్‌ అనసూయ, కమిషనర్‌ సునీత, నాయకు లు చంద్రకాంత్‌, చెన్నారెడ్డి, సుదర్శన్‌రెడ్డి పాల్గొన్నారు. 17వ వార్డులో పుర వైస్‌ చైర్మన్‌ హరినారాయణ భట్టడ్‌ ఇంటింటికీ జాతీ య జెండాలను పంపిణీ చేశారు. ఆర్టీవో కార్యాలయ ఆవరణలో ఆర్టీవో వీరస్వామి మొక్కలను నాటారు.  9వ వార్డు కౌన్సిలర్‌ మ హేష్‌ పాల్గొన్నారు. జిల్లా కేంద్రంలోని వివిధ థియేటర్లకు గాంధీజీ సినిమాను చూసేందుకు వచ్చిన విద్యార్థులకు లయన్స్‌ క్లబ్‌ ఆ ఫ్‌ నారాయణపేట తరపున లయన్‌ హరినా రాయణ భట్టడ్‌ బిస్కెట్లను అందించారు.  

నారాయణపేట రూరల్‌ : మండలంలోని ఎక్లాస్‌పూర్‌లో వజ్రోత్సవాల్లో భాగంగా బుధవారం అదనపు కలెక్టర్‌ పద్మజారాణి, జడ్పీ చైర్‌పర్సన్‌ వనజ, జడ్పీ సీఈవో జ్యోతి, డీఆర్డీవో గోపాల్‌నాయక్‌, డీఎఫ్‌వో వీణావాణి పాల్గొని మొక్కలు నాటారు. జడ్పీటీసీ సభ్యురాలు పి.అంజలి, ఎంపీడీవో సందీప్‌కుమార్‌, సర్పంచ్‌ జమునాబాయి, ఎంపీటీసీ సభ్యుడు రాంరెడ్డి పాల్గొన్నారు.  లక్ష్మీపూర్‌ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో డీఈవో గోవిందరాజులు మొక్కలు నాటారు. జిల్లా అకాడమిక్‌ మానిటరింగ్‌ అధికారి విద్యాసాగర్‌, సెక్టోరియల్‌ అఽదికారి శ్రీనివాస్‌ పాల్గొన్నారు. భైరంకొండలో బీజేపీ మండలాధ్యక్షుడు సాయిబన్న ఆధ్వర్యంలో ఇంటింటికీ జాతీయ జెండాలను పంపిణీ చేశారు. 

మరికల్‌ : ఆజాదికా అమృత్‌ మహో త్సవ్‌లో భాగంగా సీఐ రాంలాల్‌ ఆధ్వర్యంలో బుధవారం మరికల్‌ పోలీస్‌స్టేషన్‌ ఆవర ణలో ఎస్‌ఐ అశోక్‌బాబు, సిబ్బందితో కలిసి మొక్కలు నాటారు. బుడ్డగానితండా రోడ్డుకు ఇరువైవులా సర్పంచ్‌ రాములునాయక్‌ మొక్కలు నాటారు. ఏఎస్‌ఐ ఎల్లయ్య, కానిస్టేబు ల్‌ రహిమత్‌, తిరుమలేష్‌ ఉప సర్పంచ్‌ భాస్కర్‌నాయక్‌ పాల్గొన్నారు. 

కృష్ణ : మండల కేంద్రంలోని పోలీస్‌ స్టేషన్‌లో ఎస్‌ఐ విజయభాస్కర్‌ ఆధ్వర్యంలో బీజేపీ జిల్లా ఉపాధ్యక్షుడు సోమశేఖర్‌గౌడ్‌ జాతీయ జెండాలను పంపిణీ చేశారు. ఈ నెల 13 నుంచి 15 వరకు ప్రతీ ఇంటిపై జెండా ఎగురవేయాలన్నారు. సురేష్‌, మండ లాధ్యక్షుడు నర్సప్ప, నాగరాజ్‌, కులకర్ణి, శక్తి సింగ్‌, వెంకటేష్‌, రాఘవేంద్ర పాల్గొన్నారు.

మాగనూరు : వజ్రోత్సవాల సంద ర్భంగా బుధవారం మండలంలోని కొత్తపల్లి, అడవిసత్కారం, ఉజ్జల్లి, అమ్మపల్లి, గురాలిం గంపల్లి, గ్రామాల్లో ఫ్రీడం పార్కుల వద్ద 1000 మొక్కలు నాటారు. ఎంపీడీవో సుధా కర్‌రెడ్డి, మండల ప్రత్యేకాధికారి  రాణాప్రతా ప్‌ మాట్లాడుతూ నాటిన మొక్కలను రక్షించాలన్నారు.  ఎంపీపీ శ్యామలమ్మ, సింగిల్‌ విండో అధ్యక్షుడు వెంకట్‌రెడ్డి, జడ్పీటీసీ స భ్యుడు వెంకటయ్య, సర్పంచు తిమ్మప్ప పాల్గొన్నారు. అదే విధంగా పోలీస్‌ స్టేషన్‌ ఆవ రణలో ఎస్‌ఐ నరేందర్‌ ఆధ్వర్యంలో సిబ్బం ది మొక్కలు నాటారు.  

ఊట్కూర్‌ : వజ్రోత్సవ వేడుకల్లో భాగంగా మండలంలో బుధవారం జాతీయ పతాకాలను ఇంటింటికి పంచారు. మగ్దూంపూర్‌లో జడ్పీటీసీ సభ్యుడు అశోక్‌గౌడ్‌, ఎంపీపీ ఎల్కోటీ లక్ష్మీ, ఎంపీడీవో కాళప్ప, ఏపీవో ఎల్లప్ప నర్సరీలు వజ్రోత్సవ వేడుకలను జరిపారు. నిడుగుర్తి ప్రాథమికోన్నత పాఠశాలలో 75 సంవత్సరాల ఆకారంలో  మొక్కలను జాతీయ పతాకాన్ని రెపరెపలాడించారు. చిన్నపొర్ల ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయులు, ఊట్కూర్‌ బాలుర ఉన్నత పాఠశాలలో హెచ్‌ఎం సురేష్‌, ఊట్కూర్‌ పోలీస్‌స్టేషన్‌ ఆవరణలో ఎస్‌ఐ రాములు మొక్కలు నాటారు. 

మక్తల్‌ రూరల్‌ : భారత స్వతంత్ర వజ్రోత్సవాలను విజయవంతం చేయాలని సీఐ సీతయ్య అన్నారు. బుధవారం విద్యార్థు లతో కలిసి గాంధీ సినిమాను తిలకించారు. అనంతరం మక్తల్‌ పోలీస్‌ స్టేషన్‌  ఆవరణ లో ఎస్‌ఐ పర్వతాలుతో కలిసి మొక్కలు నా టారు. మండలంలోని మాద్వార్‌ ప్రభుత్వ పాఠశాలలో మొక్కలు నాటారు. జక్లేర్‌ సమీ పంలోని వ్యవసాయ పొలంలో హర్టికల్చర్‌ అధికారి ఆయిల్‌ఫామ్‌ మొక్కలు నాటారు. కర్నీ, జక్లేర్‌, వానాయకుంట గ్రామాల్లో  జా తీయ జెండాలను పంపిణీ చేశారు. సర్పం చులు రాధ, నర్సింహులు పాల్గొన్నారు. 

దామరగిద్ద :  మండల కేంద్రంలోని పోలీస్‌స్టేషన్‌ ఆవరణలో ఎస్‌ఐ శ్రీనివాస్‌ రా వు వజ్రోత్సవాల్లో భాగంగా మొక్కలు నాటారు.

నారాయణపేట క్రైం : స్వతంత్ర భారత వజ్రోత్సవ వేడుకల్లో భాగంగా బుధవారం జిల్లా పోలీస్‌శాఖ ఆధ్వర్యంలో వన మ హోత్సవ కార్యక్రమం నిర్వహించారు. ఎస్పీ వెంకటేశ్వర్లు జిల్లా పోలీస్‌ కార్యాలయ పరేడ్‌ మైదానంలో వివిధ రకాల మొక్కలను నాటారు.   ఎస్పీ మాట్లాడుతూ నేడు ఉద యం 6.30 గంటలకు జిల్లా కేంద్రంలో నిర్వహించనున్న ఫ్రీడం రన్‌ కార్యక్రమాన్ని అన్ని వర్గాల ప్రజలు అధిక సంఖ్యలో హజరై విజయవంతం చేయాలని కోరారు.








Updated Date - 2022-08-11T04:48:33+05:30 IST