‘ది ట్రిప్’ మూవీ ఫస్ట్ లుక్ విడుదల

ఆమని, గౌతమ్ రాజు, సౌమ్య శెట్టి ప్రధాన పాత్రల్లో వి.డి.ఆర్ ఫిల్మ్స్ బ్యానర్‌పై వంశీకృష్ణ ఆకెళ్ళ దర్శకత్వంలో దుర్గం రాజమౌళి నిర్మిస్తున్న చిత్రం ‘ది ట్రిప్’. తాజాగా ఈ చిత్ర ఫస్ట్ లుక్‌ను చిత్రయూనిట్ విడుదల చేసింది. ఈ పోస్టర్ చూస్తుంటే రొటీన్‌కు భిన్నంగా ఈ సినిమా తెరకెక్కుతున్నట్లుగా అర్థమవుతోంది. ప్రస్తుతం ఈ ఫస్ట్ లుక్ పోస్టర్.. సోషల్ మీడియాలో మంచి స్పందనను రాబట్టుకుంటోంది. ఖచ్చితంగా ఈ సినిమా అందరినీ అలరిస్తుందని నమ్మకంగా చెబుతున్నారు చిత్ర దర్శకనిర్మాతలు. బొంతల నాగేశ్వరరెడ్డి ఎడిటింగ్, కార్తిక్ కొడకండ్ల సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి విశ్వ దేవబత్తుల సినిమాటోగ్రాఫర్‌గా వ్యవహరిస్తున్నారు. చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలను త్వరలోనే తెలియజేస్తామని మేకర్స్ తెలిపారు.

Advertisement