ఇంటింటా త్రివర్ణ పతాకం రెపరెపలాడాలి

ABN , First Publish Date - 2022-08-10T05:49:12+05:30 IST

స్వాతంత్య్ర వజ్రోత్సవాల సందర్భంగా 13, 14, 15 తేదీల్లో ఇంటింటా త్రివర్ణ పతాకం రెపరెపలాడాలని, ఈ వేడుకల్లో అందరూ భాగస్వామ్యం కావాలని ఖ

ఇంటింటా త్రివర్ణ పతాకం రెపరెపలాడాలి

స్వాతంత్య్ర వజ్రోత్సవంలో అందరూ భాగస్వామ్యం కావాలి

జిల్లాలో 4.60లక్షల జాతీయ జెండాల పంపిణీ

విలేకరుల సమావేశంలో వెల్లడించిన ఖమ్మం కలెక్టర్‌, సీపీ 

ఖమ్మం, ఆగస్టు 9 (ఆంధ్రజ్యోతిప్రతినిధి) : స్వాతంత్య్ర వజ్రోత్సవాల సందర్భంగా 13, 14, 15 తేదీల్లో ఇంటింటా త్రివర్ణ పతాకం రెపరెపలాడాలని, ఈ వేడుకల్లో అందరూ భాగస్వామ్యం కావాలని ఖమ్మం కలెక్టర్‌ వీపీ గౌతమ్‌, సీపీ విష్ణు ఎస్‌ వారియర్‌ పిలుపునిచ్చారు. ఖమ్మం కలెక్టరేట్‌లో మంగళవారం వారు విలేకరుల సమావేశంలో మాట్లాడారు. కలెక్టర్‌ గౌతమ్‌ మాట్లాడుతూ స్వాతంత్ర వజ్రోత్సవాల నిర్వహణలో భాగంగా మంగళవారం ఇంటింటికి జెండాల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టామని, స్థానిక ప్రజాప్రతినిధుల ద్వారా ఖమ్మం జిల్లాలో 4.60లక్షల పతాకాలను పంపిణీ చేయబోతున్నామని, ఇప్పటికి 2లక్షల జెండాలు జిల్లాకు అందాయన్నారు. 13న సూర్యోదయం అనంతరం ప్రతీ ఇంటివద్ద జాతీయజెండా ఎగురవేయాలని, 15న సూర్యస్తమయం లోపు నెమ్మదిగా దించి భద్రంగా జాగ్రత్త పరచాలని సూచించారు. స్వాతంత్య్ర ఉద్యమస్ఫూర్తితో 14రోజులపాటు రూపొందించిన ప్రత్యేక కార్యక్రమాల ప్రకారం ఖమ్మం జిల్లాలో 10న వనమహోత్సవం, 11న ఫ్రీడమ్‌రన, 12న వజ్రోత్సవ కార్యక్రమాలపై మీడియా ప్రచారాలు, 13న వజ్రోత్సవ ర్యాలీలు, 14న జానపద కళాకారుల ప్రదర్శన, 15న పంద్రాగస్టు వేడుకలు, 16న సామూహిక జాతీయ గీతాలాపన, కవిసమ్మేళనం, 17న రక్తదానశిబిరాలు, 18న ఫ్రీడంకప్‌ క్రీడా పోటీలు, 19న ఆసుపత్రులు, జైళ్లు, వృద్ధాశ్రమాలు, అనాథశరణాలయాల్లో స్వీట్లు, పండ్ల పంపిణీ, 20న ముగ్గుల పోటీలు, 21న స్థానిక సంస్థల ప్రత్యేక సమావేశం, 22న ఖమ్మం భక్తరామదాసు కళాక్షేత్రంలో ముగింపు వేడుకలు నిర్వహిస్తామన్నారు. పోలీసుపరేడ్‌మైదానంలో 15న జరిగే వేడుకలకు ప్రజలు అధిక సంఖ్యలో హాజరుకావాలని పిలుపునిచ్చారు. స్వాతంత్య్ర సమర ఘట్టాలను స్మరణకు తెచ్చేలా రోజువారీ కార్యక్రమాలు నిర్వహిస్తామని, స్వాతంత్య్ర సమరయోధులను సన్మానిస్తామన్నారు. ఇక విద్యార్థుల కోసం గాంధీ సినిమాలను ఉచితంగా ప్రవర్శించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేశామన్నారు. నగర పోలీసుకమిషనర్‌ విష్ణుఎస్‌వారియర్‌ మాట్లాడుతూ జాతీయ జెండాను ఎగురవేసి మూడురోజులపాటటు ఇళ్లపై ఉంచే అవకాశం ప్రభుత్వం కల్పించిందని నిబంధనలు పాటిస్టూ జాతీయ జెండాను గౌరవించుకోవాలన్నారు. ప్రశాంత వాతావరణంలో కార్యక్రమాలను నిర్వహించేందుకు పటిష్ఠ ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. ఈ విలేకరుల సమావేశంలో అదనపు కలెక్టర్‌ మధుసూదన, తదితరులు పాల్గొన్నారు.

జెండాల పంపిణీని ప్రారంభించిన కలెక ్టర్‌

స్వాతంత్య్ర వజ్రోత్సవాల సందర్భంగా మంగళవారం ఖమ్మం కలెక్టరేట్‌లో ఇంటింటికీ జెండాల పంపిణీ కార్యక్రమాన్ని కలెక్టర్‌ వీపీ గౌతమ్‌ జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం కలెక్టరేట్‌లోని జాతిపిత మహాత్మాగాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో సీపీ విష్ణు ఎస్‌ వారియర్‌, జడ్పీ చైర్మన లింగాల కమల్‌రాజ్‌, నగర మేయర్‌ పునుకొల్లు నీరజ, సుడా చైర్మన బచ్చు విజయ్‌కుమార్‌, అదనపు కలెక్టర్లు ఎన మధుసూదన, స్నేహలత మొగిలి, మునిసిపల్‌ కమిషనర్‌ ఆదర్శ్‌ సురభి, డిప్యూటీ మేయర్‌ పాతిమా జోహారా, డీఆర్వో శిరీష, డీఆర్డీవో విద్యాచందన, తదితరులు పాల్గొన్నారు. 


ప్రారంభించిన ఎమ్మెల్యే వనమా, కలెక్టర్‌, ఎస్పీ 

కొత్తగూడెం టౌన్‌, ఆగస్టు 9 : ఆజాదీకా అమృతోత్సవంలో భాగంగా భద్రాద్రి జిల్లాలో 3.25లక్షల ఇళ్లకు పతాకాల పంపిణీ  చేసేందుకు యంత్రాంగం ఏర్పాట్లు చేసింది. మంగళవారం ఈ కార్యక్రమాన్ని కొత్తగూడెం మునిసిపాలిటీలో ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు, కలెక్టర్‌ అనుదీప్‌, ఎస్పీ డాక్టర్‌ వినిత్‌, మునిసిపల్‌ చైర్‌పర్సన్‌ కాపు సీతామహాలక్ష్మీ ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం 15రోజుల పాటు చేపట్టిన వజ్రోత్సవాలను ప్రజలు విజయవంతం చేయాలన్నారు. ప్రభుత్వ సూచనలు, నిబంధనల ప్రకారం ప్రతీ ఇంటిపై జాతీయ పతాకాలను ఆవిష్కరించాలని, ఇందుకోసం ఉచితంగా పతాకాలను అందిస్తున్నామన్నారు. 481 గ్రామ పంచాయతీల్లో 2,410 బృందాలు, నాలుగు మున్సిపాలిటీల్లో మరో 127 బృందాలను పంపిణీకి సిద్ధం చేశామన్నారు. ఇదే క్రమంలో కలెక్టర్‌, ఎస్పీ విద్యార్థులతో కలిసి కొత్తగూడెంలోని పూర్ణ థియేటర్‌లో గాంధీ చిత్రాన్ని వీక్షించారు. కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్‌ వెంకటేశ్వర్లు, డీఆర్‌డీవోపీడీ మధుసూదన్‌రాజు, డీపీవో రమాకాంత్‌, ఆర్డీవో స్వర్ణలత, మున్సిపల్‌ కమిషనర్‌ నవీన్‌, తహసీల్దార్‌ రామకృష్ణప్రసాద్‌, మునిసపల్‌ వైస్‌చైర్మన్‌ దామోదర్‌ తదితరులు పాల్గొన్నారు. 

 

Updated Date - 2022-08-10T05:49:12+05:30 IST