కాలిబాటన.. ఒడిషాకు

ABN , First Publish Date - 2020-05-21T10:44:15+05:30 IST

: రాయచోటి పట్టణం రాయుడుకాలనీ సమీపంలో ఒక ఇటుకల బట్టీలో పనిచేసేందుకు 8 కుటుంబాలకు చెందిన 22 మంది ఒడిషా నుంచి నాలుగు నెలల కిందట వచ్చారు.

కాలిబాటన.. ఒడిషాకు

  • అడ్డుకున్న అధికారులు
  • వాహనం ఏర్పాటు చేస్తామని హామీ

రాయచోటి, మే 20 : రాయచోటి పట్టణం రాయుడుకాలనీ సమీపంలో ఒక ఇటుకల బట్టీలో పనిచేసేందుకు 8 కుటుంబాలకు చెందిన 22 మంది ఒడిషా నుంచి నాలుగు నెలల కిందట వచ్చారు. కరోనా కారణంగా రెండు నెలలుగా వీరికి పనులు లేవు. చేతిలో చిల్లిగవ్వ కూడా లేదు. పూటగడవడం కూడా కష్టంగా ఉంది. సొంత ఊరికి వెళ్లిపోదామంటే లాక్‌డౌన్‌తో వీలు కాలేదు. ఈ నేపధ్యంలో వారం కిందట వలసకార్మికులను సొంత ఊళ్లకు పంపేందుకు ప్రభుత్వం అంగీకరించింది. ఇప్పటికే రాయచోటి ప్రాంతం నుంచి ఉత్తరప్రదేశ్‌, బీహార్‌ రాష్ట్రాలకు చెందిన వలసకూలీలకు అనుమతి ఇచ్చి.. ప్రత్యేక రైలులో సొంత ఊళ్లకు పంపించేశారు. ఒడిషాకు చెందిన వాళ్లకు అనుమతి రాలేదు. దీంతో బుధ వారం ఉదయమే వీళ్లంతా తాము ఉంటున్న గుడిసెల నుంచి మూటాముల్లె సర్దుకుని కాలినడకన ఒడిషాకు బయలుదేరారు.


ఈ విషయం సోషియల్‌ మీడియా ద్వారా తెలుసుకున్న ఉన్నతాధికారులు స్పందించి వలస కార్మికులను ఆపారు. వీళ్లు ఉంటున్న ఇటుకబట్టీ గుడిసెల వద్దకే తీసుకొచ్చి.. ఒకటిరెండు రోజుల్లో అనుమతి వచ్చేలా చూస్తామని హామీ ఇచ్చారు. వీళ్లందరికీ బుధవారం మధ్యాహ్నం అంగన్‌వాడీ కార్యకర్త సుజాత భోజనవవసతి కల్పించారు. రెండు రోజుల్లో అనుమతి ఇవ్వకపోతే తాము నడచుకుంటూ వెళ్లిపోతామని ఒడిషా వలస కూలీలు తెలిపారు.

Updated Date - 2020-05-21T10:44:15+05:30 IST