తాజా కేసులు 80

ABN , First Publish Date - 2020-07-04T11:13:37+05:30 IST

జిల్లాలో గురువారం రాత్రి నుంచీ శుక్రవారం రాత్రి వరకూ మరో 80 కరోనా కేసులు నమోదయ్యాయి. తిరుపతి అర్బన్‌లో 15,

తాజా కేసులు 80

కోవిడ్‌తో మరో ఇద్దరి మృతి

మొత్తం పాజిటివ్‌ల సంఖ్య 1746


తిరుపతి, జూలై 3 (ఆంధ్రజ్యోతి):జిల్లాలో గురువారం రాత్రి నుంచీ శుక్రవారం రాత్రి వరకూ మరో 80 కరోనా  కేసులు నమోదయ్యాయి. తిరుపతి అర్బన్‌లో 15, మదనపల్లె, పుత్తూరుల్లో 14 చొప్పున, చిత్తూరులో 13, నగరిలో 7, నారాయణవనంలో 4, తిరుపతి రూరల్‌లో 3, శ్రీకాళహస్తి, నిండ్ర మండలాల్లో రెండేసి, సత్యవేడు, గుర్రంకొండ, కలికిరి, రేణిగుంట, ఏర్పేడు, పలమనేరు తదితర ఆరు మండలాల్లో ఒక్కొక్కటి చొప్పున వీటిని గుర్తించారు.


తాజా కేసులతో కలిపి జిల్లాలో ఇప్పటి వరకూ నమోదైన మొత్తం కేసుల సంఖ్య 1746కు చేరుకుంది.కాగా  కోవిడ్‌ బారిన పడి మరో ఇద్దరు మృతి చెందారు. శుక్రవారం రేణిగుంటకు చెందిన రైల్వే ప్రొటెక్షన్‌ ఫోర్స్‌కు చెందిన కానిస్టేబుల్‌ ఒకరు, నగరి పట్టణానికి చెందిన ఒకరు కరోనాతో చికిత్స పొందుతూ మరణించారు. విజయనగగరానికి చెందిన ఓ ఆర్పీఎఫ్‌ కానిస్టేబుల్‌ (28) రేణిగుంటలో పని చేస్తున్నారు. రెండు రోజుల క్రితం రైల్వే బారెక్‌ విశ్రాంతి భవనంలో వంట చేసే వ్యక్తికి పాజిటివ్‌ వచ్చింది. దీంతో అక్కడున్న వారికి జరిపిన పరీక్షల్లో ఒకరికి పాజిటివ్‌ వచ్చింది. ఆయన్ను ఆస్పత్రికి తరలించగా శుక్రవారం మృతి చెందారు. దీంతో ఇప్పటి వరకూ కోవిడ్‌ బారిన పడి మరణించిన వారి సంఖ్య 11కు చేరింది. జిల్లాలో తొలి కరోనా కేసు నమోదైన శ్రీకాళహస్తిలోనే తొలి కరోనా మరణం కూడా  చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. తిరుపతి, నగరిల్లో అత్యధికంగా మూడేసి చొప్పున మరణాలు నమోదు కాగా శ్రీకాళహస్తి, నాగలాపురం, సత్యవేడు, పుత్తూరు, రేణిగుంటల్లో ఒక్కోటి చొప్పున మొత్తం ఐదు మరణాలు నమోదయ్యాయి.  


 70 శాతం కేసులు 11 మండలాల్లోనే

జిల్లాలోని మొత్తం 66 మండలాలకు గానూ ఇప్పటి వరకూ 62 మండలాల్లో కరోనా కేసులు వెలుగు చూసినా ప్రత్యేకించి 11 మండలాల్లో అసాధారణ స్థాయిలో కేసులు నమోదయ్యాయి. తిరుపతి నగరంలో కేసుల సంఖ్య ఏకంగా 314కు చేరుకోగా శ్రీకాళహస్తిలో 196, పుత్తూరులో 142, చిత్తూరులో 123, నగరిలో 118, తిరుపతి రూరల్‌లో 114 చొప్పున కేసులు నమోదయ్యాయి. అలాగే సత్యవేడులో 92, మదనపల్లెలో 57, రేణిగుంటలో 50, నాగలాపురంలో 44, నారాయణవనంలో 43 కేసులు చొప్పున ఇప్పటి దాకా నమోదయ్యాయి. జిల్లాలోని మొత్తం కేసుల్లో 70 శాతానికి పైగా ఈ 11 మండలాల్లోనే గుర్తించడం గమనార్హం.

Updated Date - 2020-07-04T11:13:37+05:30 IST