వాడవాడలా మువ్వెన్నెల జెండా రెపరెపలు

ABN , First Publish Date - 2022-08-12T05:10:10+05:30 IST

ఆజాదికా అమృత్‌ మహోత్సవ్‌లో భాగంగా వాడవాడలా మువ్వన్నెల జెండా విజయవిహారం చేస్తోంది. దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు హర్‌ ఘర్‌ తిరంగా (ఇంటింటికీ మువ్వన్నెల జెండా) అంటూ ఆజాదికా అమృత్‌ మహోత్సవ్‌ నిర్వహిస్తున్నారు.

వాడవాడలా మువ్వెన్నెల జెండా రెపరెపలు
జమ్మలమడుగు-ప్రొద్దుటూరు రోడ్డులో జాతీయ జెండా ర్యాలీ

ఆజాదికా అమృత్‌ మహోత్సవ్‌లో భాగంగా వాడవాడలా మువ్వన్నెల జెండా విజయవిహారం చేస్తోంది. దేశానికి స్వాతంత్య్రం వచ్చి 

75 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు హర్‌ ఘర్‌ తిరంగా (ఇంటింటికీ మువ్వన్నెల జెండా) అంటూ ఆజాదికా అమృత్‌ మహోత్సవ్‌ నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా జమ్మలమడుగు, ప్రొద్దుటూరు, బద్వేలు, మైదుకూరు నియోజకవర్గాల్లో జాతీయ జెండా రెపరెపలాడుతోంది. జమ్మలమడుగులో వెయ్యి మీటర్ల పొడవైన జాతీయ పతాకంతో పురవీధుల్లో ర్యాలీ నిర్వహించారు. జమ్మలమడుగు గాంధీ విగ్రహం వద్ద ఏర్పాటు చేసిన సమావేశంలో జూనియర్‌ సివిల్‌ జడ్జి షేక్‌ బాబాఫకృద్దీన్‌ మాట్లాడారు. తన సర్వీసులో ఇప్పటి వరకు దేశం కోసం చేసిన ఇంత గొప్ప ర్యాలీని ఇక్కడే మొదటగా చూశానని జమ్మలమడు గు డీఎస్పీ నాగరాజు ఉత్సాహాన్ని ప్రదర్శించారు. ర్యాలీలో అల్లూరి సీతారామరాజు వేషధారణలో న్యాయవాది సుబ్బారావు, ఇతరులు ఆకట్టుకున్నారు. చిన్నారులు వివిధ రకాల వేషాలతో ఆకట్టుకున్నారు. విద్యార్థులు దేశభక్తిని అలవర్చుకోవాలని ప్రొద్దుటూరు ఫస్ట్‌ అడిషినల్‌ జూనియర్‌ సివిల్‌ జడ్జి హారిక పేర్కొన్నారు. గురువారం ఆజాదీకా అమృత్‌ మహోత్సవ్‌లో భాగంగా వైవీఎస్‌ మున్సిపల్‌ గర్ల్స్‌ హైస్కూల్‌ విద్యార్థినుల ర్యాలీని జడ్జి ప్రారంభించారు. పట్టణంలో త్రివర్ణ పతాకాలతో కాంగ్రెస్‌ పార్టీ జిల్లా అధ్యక్షుడు నీలి శ్రీనివాసరావు ర్యాలీ నిర్వహించారు. వివరాల్లోకెళితే....

జమ్మలమడుగు రూరల్‌, ఆగస్టు 11: పట్టణంలో గురువారం మధ్యాహ్నం రెండు గంటల నుంచి జాతీయ జెండా ర్యాలీ ప్రారంభమైంది. మున్సిపల్‌ కార్యాలయం నుంచి ప్రారంభమైన ర్యాలీ ఆర్టీసీ బస్టాండు, క్యాంబె ల్‌ వైద్యశాల, పాత బస్టాండు మీదుగా కూరగాయల మార్కెట్‌వీధి, మెయిన్‌బజార్‌, పలగాడి వీధి, సంజాముల మోటు మీదుగా గాంధీ విగ్రహం వద్దకు చేరుకుంది. గాంధీ విగ్రహం వద్ద ఏర్పాటు చేసిన సమావేశంలో జమ్మలమడుగు జూనియర్‌ సివిల్‌ జడ్జి షేక్‌ బాబాఫకృద్దీన్‌ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం, సుప్రీం, హైకోర్టు అధికారుల పిలుపు మేరకు పట్టణంలో వెయ్యి మీటర్ల మువ్వెన్నెల జెండా ర్యాలీతో విజయవంతం మైందన్నారు. మువ్వెన్నెల జెండా ప్రతి ఇంటిపై ఎగురవేసి భారతీయ ఐక్యతను ప్రపంచ దేశాలకు చాటి చెప్పాలని పిలుపునిచ్చారు. ప్రజలు ప్రతి ఇంటిపై జాతీయ జెండా ఎగురవేయాలని (హర్‌ఘర్‌ తిరంగ) ఆయన కోరారు.

ర్యాలీలో జమ్మలమడుగు బార్‌ అసోసియేషన్‌ న్యాయవాదులు, సబ్‌డివిజన్‌ పోలీసు అధికారి నాగరాజు, అధికారులు పాల్గొన్నారు. వెయ్యి మీటర్ల మువ్వెన్నెల జెండాకు సహకరించిన జౌళీ దుకాణాల కమిటీ, టైలర్స్‌ అసోసియేషన్‌ పుల్లయ్య, కొండయ్యకు కృతజ్ఞతలు తెలియజేశారు. డీఎస్పీ నాగరాజు మాట్లాడుతూ ప్రజల్లో సామాజిక స్పృహ కల్పించేందుకు ఇలాంటి ర్యాలీ ప్రయోజనకరమన్నారు. కార్యక్రమంలో జమ్మలమడుగు బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు దేవగుడి నారాయణరెడ్డి, సెక్రటరి మురళీధర్‌రెడ్డి, గౌషియా పీఠాధిపతి గౌస్‌పీరాఖాద్రి, తాహీర్‌పీరాఖా ద్రి, పోలీసు, రెవెన్యూ అధికారులు, ఉర్దూ హైస్కూలు, శ్రీనివాస డిగ్రీ కళాశాల, షిరిడీసాయి విద్యాసంస్థలు, మదరసా, ఆరోగ్య సిబ్బంది, క్యాంబెల్‌ సిబ్బంది, విద్యార్థినీ విద్యార్థులు, పాల్గొన్నారు. అనంతరం పాత బస్టాండు గాంధీ విగ్రహం వద్ద జాతీయ జెండాతో మానవహారం ఏర్పడి జడ్జి బాబాఫకృద్దీన్‌, జాతీయ గీతం పాడారు. పట్టణంలో కాంగ్రెస్‌ పార్టీ ఆధ్వర్యంలో ఆజాదికా అమృత్‌ మహోత్సవ్‌ను ఘనంగా నిర్వహించాలని, నాటి స్వాతంత్య్ర సంగ్రామ చరిత్రను నేటితరానికి చాటిచెప్పాలని ఏఐసీసీ పిలుపు మేరకు ఏపీసీసీ ఆదేశానుసారం గౌర వ పాదయాత్ర ర్యాలీ నిర్వహించినట్లు జిల్లా అధ్యక్షుడు నీలి శ్రీనివాసు లు తెలిపారు.

కార్యక్రమంలో కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర నాయకులు సత్తార్‌, ఎం.విజయభాస్కర్‌, తిరుమలేష్‌, విజయకుమార్‌, జిల్లా, స్థానిక నేత లు పాల్గొన్నారు. స్థానిక చౌడేశ్వరీదేవాలయం ప్రాంతం నుంచి చేనే తలు ర్యాలీ నిర్వహించారు. ఆలయ కమిటీ అధ్యక్షుడు గంజికుంట తిరుమలదాసు, చౌడేశ్వరీదేవి దేవాలయం కమిటీ చేనేత కార్మికులు నాగులకట్ట వీధి నుంచి సంజాముల మోటు వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు రెండు వేల మందికి స్వీట్లు పంచిపెట్టారు. కార్యక్రమంలో నాగులకట్ట వీధిలోని చేనేత కార్మికులు, చౌడేశ్వరీదేవి ఆలయ కమిటీ వారు పాల్గొన్నారు.

విద్యార్థులు దేశ భక్తిని అలవర్చుకోవాలి

ప్రొద్దుటూరు టౌన్‌, ఆగస్టు 11: విద్యార్థులు దేభక్తిని అలవర్చుకోవాలని ఫస్ట్‌ అడిషినల్‌ జూనియర్‌ సివిల్‌ జడ్జి హారిక పేర్కొన్నారు. ఆజాదీకా అమృత్‌ మహోత్సవ్‌లో భాగంగా వైవీఎస్‌ మున్సిపల్‌ గర్ల్స్‌ హైస్కూల్‌ విద్యార్థినుల ర్యాలీని జడ్జి ప్రారంభించారు. స్వాతంత్య్ర సమరయోధుల వేషధారణలతో విద్యార్థులు టీబీ రోడ్డు మీదుగా గాంధీ విగ్రహం వర కు ర్యాలీ నిర్వహించి, గాంధీ విగ్రహానికి నివాళులర్పించారు. ఈ ర్యాలీ లో 75 అడుగుల జాతీయ పతాకం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. కార్యక్రమంలో డిప్యూటీ డీఈఓ నాగరాజు, ఎంఈఓ సావిత్రమ్మ, హెచ్‌ఎం కాశీప్రసాద్‌రెడ్డి,  పోలీసులు, ఫైర్‌ సిబ్బంది, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. స్వాతంత్య్రం కోసం ప్రాణత్యాగం చేసిన మహనీయులను స్మరించుకోవాలని రవీంద్ర హైస్కూల్‌ పాఠశాల అధ్యక్షుడు పల్లేటి ప్రభాకర్‌రెడ్డి పేర్కొన్నారు. పాఠశాల వద్ద నుంచి అణా బంకు, వసంతపేట, గాంధీ రోడ్డు, మున్సిపల్‌ కార్యాలయం మీదుగా ర్యాలీ నిర్వహించారు. కరస్పాండెంట్‌ విష్ణువర్ధన్‌రెడ్డి, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. 

ప్రతి విద్యార్థి భారతీయతను కలిగి ఉండాలి

బద్వేలు, ఆగస్టు 11: ప్రతి విద్యార్థి జాతీయ జెండా గొప్పతనం తెలుసు కుని హృదయం నిండా భారతీయతను కలిగి ఉండాలని బిజివేముల వీరారెడ్డి డిగ్రీ, పీజీ కళాశాల ప్రిన్సిపాల్‌ వెంకటసుబ్బారెడ్డి పేర్కొన్నా రు. ‘హర్‌ ఘర్‌ తిరంగా’ కార్యక్రమం నిర్వహించారు. 13 నుంచి 15వ తేదీ వరకు ప్రతి ఇంటిపై జాతీయ జెండా ఎగురవేయాలని సూచించా రు. అనంతరం  కళాశాల నుంచి ర్యాలీ నిర్వహించి గాంధీ విగ్రహానికి  పూలమాల వేసి నివాళులర్పించారు. కళాశాల ఎన్‌ఎస్‌ఎస్‌ సమన్వయ కర్తలు దొరస్వామి నాయకల్‌, ఈశ్వరయ్య తదితరులుపాల్గొన్నారు.

 వీరారెడ్డి అనుబంధ సంస్థలైన నారాయణమ్మ అగ్రికల్చరల్‌, సీడ్‌ టెక్నాలజీ పాలిటెక్నిక్‌ కళాశాలలో విద్యార్థులకు కళాశాల ప్రిన్సిపాల్‌ చైతన్యకుమార్‌ రెడ్డి, సునీల్‌ ఆధ్వర్యంలో చిత్రలేఖన పోటీలు నిర్వహిం చారు. ఈ పోటీలకు విశేష స్పందన లభించింది. 





Updated Date - 2022-08-12T05:10:10+05:30 IST