మూడు రాజధానులు మాకొద్దు: ఏపీ ప్రజలు

ABN , First Publish Date - 2020-08-02T18:26:50+05:30 IST

ఆంధ్రప్రదేశ్‌కు మూడు రాజధానులపై తీవ్ర వ్యతిరేకత వస్తోంది.

మూడు రాజధానులు మాకొద్దు: ఏపీ ప్రజలు

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌కు మూడు రాజధానులపై తీవ్ర వ్యతిరేకత వస్తోంది. మూడు రాజధానులు వద్దంటూ నిరసనలు మిన్నంటుతున్నాయి. ఓ జాతీయ చానల్ నిర్వహించిన సర్వేలోనూ ఇదే వెల్లడైంది. దేశంలో 29 రాష్ట్రాలు. ప్రతి రాష్ట్రానికి ఒక రాజధాని. కానీ ఆరేళ్లకిందట సొంతరాజధాని లేకుండానే ఏర్పడిన నవ్యాంధ్రకు మాత్రం మూడు రాజధానులు. పాలనకు ఒకటి, న్యాయానికి ఇంకొకటి, చట్ట సభలకు మరొకటి. దీనికి సర్కార్ పెద్దలు పెట్టిన పేరు వికేంద్రీకరణ. ఇదంతా ప్రజల కోసమేనని, వారి అభివృద్ధి కోసమేనని చెబుతున్నారు. కానీ దేశంలో ఎక్కడాలేని ఈ వింత నిర్ణయాన్ని జనమే తిరస్కరించారు. ఇది ఎంతమాత్రం సరికాదని తేల్చి చెప్పారు.


ఈ ఏడాది జనవరి 20న ఏపీ శాసనసభలో పరిపాలన వికేంద్రీకరణ, సీఆర్డీయే బిల్లుల రద్దును అసెంబ్లీలో ఆమోదించారు. ఆ మరుసటి రోజునే అంటే జనవరి 21న ఇండియా టీవీ చానల్ దీనిపై ట్విట్టర్‌లో పోల్ నిర్వహించింది. ఈ సర్వేలో పాల్గొన్నవారిలో 67 శాతం మంది ఎంతమాత్రం మంచిది కాదని చెప్పారు. 29 శాతం మంది మాత్రమే మంచి నిర్ణయమని సమర్ధించారు. నాలుగు శాతం మంది మాత్రం ఏమీ చెప్పలేమన్నారు. అత్యధికులు సీఎం జగన్ నిర్ణయాన్ని వ్యతిరేకించారు. ఈ సర్వేలో సుమారు 8 వేలమంది పాల్గొన్నారు.

Updated Date - 2020-08-02T18:26:50+05:30 IST