ఎనిమిది రోజుల్లోనే దొంగ అరెస్ట్‌

ABN , First Publish Date - 2020-10-24T11:57:36+05:30 IST

దొంగతనం చేసిన ఎనిమిదిరోజుల్లోనే నిందితుడిని తిరుపతి క్రైం పోలీసులు అరెస్టు చేశారు. చోరీ సొత్తు రికవరీ చేశారు.

ఎనిమిది రోజుల్లోనే దొంగ అరెస్ట్‌

రూ.12.5 లక్షల వెండి, బంగారు ఆభరణాలు స్వాధీనం


తిరుపతి(నేరవిభాగం), అక్టోబరు 23: దొంగతనం చేసిన ఎనిమిదిరోజుల్లోనే నిందితుడిని తిరుపతి క్రైం పోలీసులు అరెస్టు చేశారు. చోరీ సొత్తు రికవరీ చేశారు. ఈ వివరాలను శుక్రవారం సాయత్రం క్రైమ్‌ డీఎస్పీ జి. మురళీధర్‌ మీడియాకు వెల్లడించారు. ఆ ప్రకారం.. అనంతపురం జిల్లా తనకల్లు మండలం నందిగానిపల్లె కొక్కంటి క్రాస్‌కు చెందిన సూరిబాబు కుమారుడు పసుపులేటి సాయికుమార్‌ (23) అలియాస్‌ సాయి, అలియాస్‌ సాయినితిన్‌ చెడు వ్యసనాలకు అలవాటు పడ్డాడు. దీనికి డబ్బుకోసం దొంగతనాలు మొదలు పెట్టాడు. తిరుపతి నగరం కొర్లగుంట ప్రాంతంలో స్విమ్స్‌ ఉద్యోగి ఇంట్లో ఎవరూలేని సమయంలో ఈనెల 16న పట్టపగలే చోరీకి పాల్పడ్డాడు. సాయికుమార్‌ చోరీకి పాల్పడ్డట్టు పోలీసులు గుర్తించి.. నిఘా పెట్టారు. 8 రోజుల్లోనే దొంగను గుర్తించి క్రైమ్‌ సీఐ మోహన్‌ అరెస్ట్‌ చేశారు. రూ.11.35 లక్షల విలువచేసే (222 గ్రాములు) ఎనిమిది జతల కమ్మలు, ఓ నెక్లెస్‌, చేతిగడియారం, సుమారు రూ.14వేల (225 గ్రాములు) విలువ చేసే ఐదు వెండి పట్టీలు, రూ.లక్ష విలువజేసే యాపిల్‌ ఐపాడ్‌, ఓ సెల్‌ఫోన్‌తోపాటు మొత్తం రూ.12.5 లక్షల చోరీ సొత్తు స్వాధీనం చేసుకున్నట్లు డీఎస్పీ మురళీధర్‌ వివరించారు. తక్కువ వ్యవధిలోనే కేసు ఛేదించిన క్రైం సీఐ మోహన్‌, ఎస్‌ఐ త్యాగరాజుచెట్టి, సిబ్బందికి రివార్డు అందించేందుఉ ప్రతిపాదన పంపుతున్నట్లు చెప్పారు. 

Updated Date - 2020-10-24T11:57:36+05:30 IST