ఆలయ పునర్నిర్మాణ పనులు ప్రారంభం

ABN , First Publish Date - 2022-08-09T06:58:19+05:30 IST

మండలంలోని లింగగిరిలో ఉన్న సీతా రామచంద్ర స్వామి దేవాలయ పునర్నిర్మాణానికి ప్రభుత్వం సీజీఎఫ్‌ నిధులు రూ.45లక్షలను ఇటీవల మంజూరు చేయడంతో పనులను సోమవారం ప్రారంభించారు.

ఆలయ పునర్నిర్మాణ పనులు ప్రారంభం
ఆలయాన్ని కూల్చివేస్తున్న అధికారులు

హుజూర్‌నగర్‌, ఆగస్టు 8: మండలంలోని  లింగగిరిలో  ఉన్న సీతా రామచంద్ర స్వామి దేవాలయ పునర్నిర్మాణానికి ప్రభుత్వం సీజీఎఫ్‌ నిధులు రూ.45లక్షలను ఇటీవల మంజూరు చేయడంతో పనులను సోమవారం ప్రారంభించారు. 1822లో లింగగిరిలోని అప్పటి దొరలు మంత్రిప్రగడ నరహరిరాజు ఈ ఆలయాన్ని నిర్మించి శ్రీసీతారామచంద్ర స్వామి దేవతామూర్తులను ప్రతిష్ఠించారు. ప్రస్తుతం పునర్నిర్మాణం సంద ర్భంగా ఆనాడు ప్రతిష్ఠించిన విగ్రహాన్ని పక్కకు తొలగించి బాలాలయం ఏర్పాటు చేశారు.  రెండు రోజులుగా దేవాలయ పునర్నిర్మాణ పూజలు కొనసాగుతున్నాయి. ఈ నెల 21న దేవాలయ పునర్నిర్మాణానికి శంకు స్థాపన చేయడానికి ఏర్పాటు చేస్తున్నారు. గ్రామపెద్దల సమక్షంలో పాత ఆలయాన్ని పూర్తిగా కూల్చివేశారు. ఈ కార్యక్రమంలో ఈఓ కొండారెడ్డి, దామోదరాచార్యులు, కర్నాటి అంజిరెడ్డి, మంత్రిప్రగడ రాఘవరావు, పుల్లయ్య, భీమిశెట్టి రామారావు, కడియాల సత్యనారాయణ, కాసర్ల నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.




Updated Date - 2022-08-09T06:58:19+05:30 IST