ఆలయం చెంతనే తాత్కాలిక కొవిడ్‌ కేర్‌ సెంటర్‌

ABN , First Publish Date - 2022-01-18T06:05:57+05:30 IST

పట్టణంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన పార్వతీబుగ్గరామలింగేశ్వరస్వామి ఆలయం వద్ద తాత్కాలిక కొవిడ్‌ కేర్‌ సెంటర్‌ను అధికారు లు ఏర్పాటు చేశారు.

ఆలయం చెంతనే తాత్కాలిక కొవిడ్‌ కేర్‌ సెంటర్‌
సిద్ధం చేసిన మంచాలు

భక్తులు, అర్చకుల్లో వ్యతిరేకత

కాలనీ వాసుల్లోనూ భయాందోళనలు 

అధికారుల ఏకపక్ష నిర్ణయంతో విస్తుపోతున్న జనం


తాడిపత్రి, జనవరి 17: పట్టణంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన పార్వతీబుగ్గరామలింగేశ్వరస్వామి ఆలయం వద్ద తాత్కాలిక కొవిడ్‌ కేర్‌ సెంటర్‌ను అధికారు లు ఏర్పాటు చేశారు. పెరుగుతున్న కొవిడ్‌ కేసులను దృష్టిలో ఉంచుకొని కొవిడ్‌ సెంటర్‌ ఏర్పాటుకు అధికారులు పలుచోట్ల గాలించారు. చివరికి ఆలయం వద్ద ఉన్న ఎన్టీఆర్‌ కమ్యూనిటీ హాలును నిర్ణయించి ఉన్నతాధికారులకు నివేదిక పం పారు. వారి ఆమోదంతో కొవిడ్‌ కేర్‌ సెంటర్‌లో సోమవారం దాదాపు 35 బెడ్లు, మంచాలను సిద్ధం చేశారు. ఏర్పాట్లను రెవెన్యూ అధికారులు పర్యవేక్షించారు. కాగా ఆలయం పక్కనే ఉన్న కమ్యూనిటీ హాలులో తాత్కాలిక కొవిడ్‌ కేర్‌ సెంట ర్‌ ఏర్పాటు చేయడంపై పలు విమర్శలు వస్తున్నాయి. అర్చకులు, భక్తుల్లో వ్యతి రేకత వ్యక్తమవుతోంది. నిత్యం భక్తుల రద్దీ ఉండడంతో పాటు మరో నెలరోజుల్లో మహాశివరాత్రి వేడుకలు అత్యంత వైభవంగా జరగనున్నాయి. పది రోజులపా టు జరిగే బ్రహ్మోత్సవాలకు వేలసంఖ్యలో భక్తులు స్వామివారిని దర్శించుకుంటారు. శివరాత్రి ఒక్కరోజే స్వామివారిని దాదాపు 20 వేల మంది భక్తులు దర్శించుకుంటారు. జిల్లాతోపాటు సరిహద్దున ఉన్న కడప, కర్నూలు జిల్లాల నుంచి వేల సంఖ్యలో భక్తులు తరలివస్తుంటారు. ప్రస్తుతం కొవిడ్‌ సెంటర్‌ను ఎంపికచేసిన కమ్యూనిటీ హాలు వద్ద పెద్దఎత్తున తిరుణాల జరగనుంది. ఇక్కడ చిన్నపిల్లల నుంచి వృద్ధుల వరకు భారీగా గుమికూడతారు. కమ్యూనిటీహాలు వద్ద పెన్నానది ప్రవహిస్తోంది. మరోవైపు కమ్యూనిటీ హాలుకు కూతవేటు దూరంలో షిర్డీసాయిబాబా, అయ్యప్పస్వామి ఆలయం, రమణ మహర్షి ఆశ్రమం, దత్తాత్రే య స్వామి, సాక్షిగణపతి ఆలయం, అంబటి ఆశ్రమం, వృద్ధాశ్రమాలు ఉన్నా యి. నిత్యం భక్తుల తాడికి ఉన్న చోట కొవిడ్‌ సెంటర్‌ను ఎలా ఏర్పాటుచేస్తారం టూ భక్తుల నుంచి ఆందోళన వ్యక్తమవుతోంది. ఇక్కడ కొవిడ్‌ నివారణ కోసం సెంటర్‌ను ఏర్పాటుచేశారా? లేక కొవిడ్‌ వ్యాప్తి చేసేందుకా? అని పలువురు ప్ర శ్నిస్తున్నారు. కమ్యూనిటీ హాలు సమీపంలో బంకమడివీధి ఉంది. ఈ ప్రాంతం లో వేలాది కుటుంబాలు నివాసముంటున్నాయి. కొవిడ్‌ కేర్‌ సెంటర్‌ ఏర్పాటుపై స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. 


ఆర్డీఓ సూచనల మేరకే...: నాగభూషణం, తహసీల్దార్‌

ఆర్డీఓ మధుసూదన సూచనల మేరకు కొవిడ్‌ కేర్‌ సెంటర్‌ను ఏర్పాటుచేస్తు న్నాం. ఇప్పటికే 35 బెడ్లను ఏర్పాటుచేశాం. అవసరమైతే మరిన్ని బెడ్లను అందుబాటులో ఉంచుతాం. కేర్‌సెంటర్‌లో కొవిడ్‌ నిర్ధారణ అయిన వారికి అనంతపురం పంపుతాం. ఇక్కడ కేర్‌సెంటర్‌ను ఏర్పాటు చేయడం వల్ల ఎవరూ భయపడాల్సిన అవసరం లేదు.


ఎన తిమ్మాపురంలో...

గుంతకల్లు: మండలంలోని ఎన తిమ్మాపురం ఆయూష్‌ ప్రైవేట్‌ ఆసుపత్రి లో కొవిడ్‌ కేర్‌ సెంటరును ప్రారంభించినట్లు తహసీల్దారు రాము సోమవారం తెలిపారు. గత సంవత్సరం ఈ సెంటరును కొవిడ్‌ బాధితులకు అందుబాటులో తెచ్చామని, ప్రస్తుతం కొవిడ్‌ కేసులు పెరుగుతున్న కారణంగా తిరిగి సెంటరు ను ప్రారంభించామన్నారు. వంద బెడ్లను సిద్ధం చేశామని, అవసరమైన వైద్యులు, ఆక్సిజన సిలిండర్లను సిద్ధం చేసినట్లు పేర్కొన్నారు. కొవిడ్‌తో బాధపడేవారు తమకు సమాచారమిస్తే ఈ సెంటరుకు తరలించి చికిత్స అందిస్తామన్నారు.


Updated Date - 2022-01-18T06:05:57+05:30 IST