తహసీల్దార్‌ను వెంటనే సస్పెండ్‌ చేయాలి

ABN , First Publish Date - 2022-10-02T04:06:35+05:30 IST

మండ లంలో విధులు నిర్వహిస్తున్న వీఆర్‌ఏలను తహసీల్దార్‌ అనంత రాజ్‌ వ్యక్తిగత అవసరాలకు వాడుకుంటూ అసభ్య పదజాలంతో దూషిస్తూ వేధింపులకు గురిచేస్తున్నాడని అతనని తక్షణమే సస్పెండ్‌ చేయాలని డిమాండ్‌ చేస్తూ కుమ రంభీం ఆసిఫాబాద్‌, మంచిర్యాల జిల్లాల వీఆర్‌ఏలు శనివారం స్థానిక తహసీల్దార్‌ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. తహసీల్దార్‌ను సస్పెండ్‌ చేసే వరకు ధర్నా కొనసాగిస్తామని స్పష్టంచేశారు.

తహసీల్దార్‌ను వెంటనే సస్పెండ్‌ చేయాలి
తహసీల్దార్‌తో వాగ్వాదానికి దిగిన వీఆర్‌ఏలు

పెంచికలపేట, అక్టోబరు 1: మండ లంలో విధులు నిర్వహిస్తున్న వీఆర్‌ఏలను తహసీల్దార్‌ అనంత రాజ్‌ వ్యక్తిగత అవసరాలకు వాడుకుంటూ అసభ్య పదజాలంతో దూషిస్తూ వేధింపులకు గురిచేస్తున్నాడని అతనని తక్షణమే సస్పెండ్‌ చేయాలని డిమాండ్‌ చేస్తూ కుమ రంభీం ఆసిఫాబాద్‌, మంచిర్యాల జిల్లాల వీఆర్‌ఏలు శనివారం స్థానిక తహసీల్దార్‌ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. తహసీల్దార్‌ను సస్పెండ్‌ చేసే వరకు ధర్నా కొనసాగిస్తామని స్పష్టంచేశారు. ఈ సందర్భంగా వీఆర్‌ఏల సంఘం జిల్లా అధ్యక్షుడు నారాయణ, వీఆర్‌ఏ పద్మ మాట్లాడుతూ 69రోజులుగా ధర్నా చేస్తున్న వీఆర్‌ఏలను వ్యక్తిగత అవసరాల కోసం వాడుకుంటున్నాడని ఆరోపించారు. తను కిరాయికి ఉంటున్న ఇంటిలో పనులు చేయించుకో వడం, రూంకు పిలిపించుకోవడం,  కార్యాలయంలో అసభ్యపదజాలంతో దూషిస్తూ లైంగిక వేధింపులకు గురిచేసేలా మాట్లాడుతున్నాడని వాపోయారు. చెడ్వాయి వీఆర్‌ఏ మల్లేష్‌కు బదులుగా తన భార్యను విధులకు రమ్మని చెప్పడం ఎంతవరకు సమంజసమ న్నారు. పైఅధికారులు వచ్చి తమకు న్యాయం చేసే వరకు ధర్నాకొనసాగిస్తామని తెలిపారు. ఈ విష యమై తహసీల్దార్‌ అనంతరాజ్‌ను వివరణ కోరగా నేను ఎవరినీ వ్యక్తిగతపనులకు పిలువలేదని, దూషించలేదన్నారు. కావాలనే తనపై బురద జల్లుతు న్నారని అన్నారు. తన మాటలతో ఎవరికై ఇబ్బందిగా ఉంటే క్షమాపణలు సైతం చెప్పినట్లు తెలిపారు.

Updated Date - 2022-10-02T04:06:35+05:30 IST