Chitrajyothy Logo
Advertisement
Published: Sat, 20 Aug 2022 00:00:00 IST

చిరు పుట్టిన రోజు కానుక

twitter-iconwatsapp-iconfb-icon

ఈనెల 22న చిరంజీవి పుట్టిన రోజు. ఈ సందర్భంగా చిరు కొత్త సినిమా కబుర్లు, పోస్టర్లు, టీజర్లూ రాబోతున్నాయి. చిరు చేతిలో ఇప్పుడు మూడు సినిమాలున్నాయి. వాటిలో ‘గాడ్‌ ఫాదర్‌’ ఒకటి. మోహన్‌ రాజా దర్శకత్వం వహించిన చిత్రమిది. ఆర్‌.బి.చౌదరి, ఎన్వీ ప్రసాద్‌ నిర్మాతలు. ఆగస్టు 21న ‘గాడ్‌ ఫాదర్‌’ టీజర్‌ని విడుదల చేయనున్నారు. బాలీవుడ్‌ స్టార్‌ సల్మాన్‌ ఖాన్‌ ఓ కీలక పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే. నయనతార, పూరి జగన్నాథ్‌, సత్యదేవ్‌ కీలక పాత్రధారులు. తమన్‌ సంగీతం అందిస్తున్నారు. ఈ యేడాదే ‘గాడ్‌ ఫాదర్‌’ థియేటర్లోలో సందడి చేస్తాడు. మలయాళ సూపర్‌ హిట్‌ చిత్రం ‘లూసీఫర్‌’కి ఇది రీమేక్‌.

మెగా కార్నివాల్‌

ప్రతి యేడాది చిరంజీవి పుట్టిన రోజు సందర్భంగా అభిమానులంతా కలుసుకొని వేడుక చేసుకోవడం అలవాటే. ఈసారి మెగా కార్నివాల్‌ పేరుతో ఈ కార్యక్రమం నిర్వహించబోతున్నట్టు నాగబాబు తెలిపారు. హైదరాబాద్‌లోని హైటెక్స్‌ వేదికగా ఈ వేడుకలు జరుగుతాయి. ఈ కార్యక్రమంలో మెగా హీరోలంతా పాల్గొనబోతున్నారు. చిరు నటించిన కొన్ని సూపర్‌ హిట్‌ చిత్రాల్ని, అందులోని కీలకమైన సన్నివేశాల్ని, పాటల్నీ 

ఈ మెగా కార్నివాల్‌లో ప్రదర్శిస్తారని 

సమాచారం. 

Advertisement
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Advertisement
Advertisement