ప్రమాదకర రసాయన పరిశ్రమలపై నిఘా

ABN , First Publish Date - 2020-07-11T11:34:06+05:30 IST

జిల్లాలో ప్రమాదకర రసాయన పరిశ్రమలపై నిఘా పెట్టేందుకు లోకల్‌ క్రైసీస్‌ గ్రూప్‌ (స్థానిక ప్రమాదాల నివారణ పరిశీలన బృందం) ఏర్పాటైంది.

ప్రమాదకర రసాయన పరిశ్రమలపై నిఘా

ఆర్డీవో ఆధ్వర్యంలో బృందం ఏర్పాటు

కర్మాగారాల్లో భద్రత, ఇతర అంశాల పరిశీలన


గుజరాతీపేట, జూలై 10: జిల్లాలో ప్రమాదకర రసాయన పరిశ్రమలపై నిఘా పెట్టేందుకు లోకల్‌ క్రైసీస్‌ గ్రూప్‌ (స్థానిక ప్రమాదాల నివారణ పరిశీలన బృందం) ఏర్పాటైంది. కర్మాగారాల్లోని  భద్రత, సురక్షిత అంశాలను పరిశీలించేందుకు  ఈ బృందాన్ని కలెక్టర్‌ నివాస్‌ ఏర్పాటు చేశారు. ఆర్డీవో ఆధ్వర్యంలో పని చేసే ఈ గ్రూప్‌ శుక్రవారం స్ధానిక రె వెన్యూ డివిజనల్‌ కార్యాలయంలో సమావేశమైంది.  ఆర్డీవో ఎంవీ రమణ అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కర్మాగారాల చట్టం, అనుబంధ చట్టాలైన మానుఫాక్చర్‌ స్టోరేజ్‌, ఇంపోర్టు ఆఫ్‌ హజార్డస్‌ కెమికల్‌ రూల్స్‌, కెమికల్‌ ఆక్సిడెంట్‌ రూల్స్‌, తదితర చట్టాలకు అనుగు ణంగా కర్మాగారాలు తీసుకుంటున్న చర్యలను ఈ బృందం పరిశీలిస్తుందని చెప్పారు.


ఈ బృందానికి కర్మాగారాల తనిఖీ అధికారి సభ్య కార్యదర్శిగా వ్యవహరిస్తాని తెలి పారు. సభ్యులుగా అగ్నిమాపక, పోలీసు, మండల పరిషత్‌ అభివృద్ధి అధికారులు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల వైద్యులు, అరబిందో ఫార్మాలిమిటెడ్‌, ఆంధ్రా ఆర్గానిక్స్‌ లిమిటెడ్‌, స్మార్ట్‌కెమ్‌ ఇండస్ట్రీస్‌ లిమిటెడ్‌, ఎన్‌ఏసీఎల్‌ ఇండస్ట్రీస్‌ లిమిటెడ్‌, రెడ్డీ లేబొ రేటరీస్‌ లిమిటెడ్‌ ప్రతినిధులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధిగా ఆర్ట్స్‌ ఎన్‌జీవో, ఇద్దరు వైద్యులు, ఇద్దరు కెమికల్‌ ట్రాన్స్‌ పోర్టర్లు, ఇద్దరు సోషల్‌ వర్కర్లు ఉంటారని చెప్పారు. కెమికల్‌ ఎమర్జెన్సీ జరిగినప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ప్రజల్లో చైతన్యం తీసుకురావడం కోసం అవగా హన సదస్సుల నిర్వాహణపై సభ్యులు ప్రధాన చర్యలు చేపడతారన్నారు.


ఫ్యాక్టరీల్లో ప్రతీ ఆరు నెలలకు ఒకసారి మాక్‌ డ్రిల్‌ నిర్వహించాలన్నారు. క్రైసీస్‌ గ్రూప్‌ కోసం పైడిభీమవరంలో ప్రత్యేకంగా ఒక కార్యా లయాన్ని ఏర్పాటు చేయాలని  పేర్కొన్నారు. కార్యక్రమంలో డిప్యూటీ చీఫ్‌ ఇన్పెక్టర్‌ ఆఫ్‌ ఫ్యాక్టరీస్‌ జీవీవీఎస్‌ సూర్యనారాయణ, కర్మాగారాల తనిఖీ అధికారి, సభ్య కార్యదర్శి పైడి చిన్నారావు, సభ్యుడు ఎన్‌.సన్యాశిరావు, ఎచ్చెర్ల అగ్నిమాపక ఇన్‌స్పెక్టర్‌ శ్రీనుబాబు, రణస్థలం అగ్నిమాపక అధికారి పోలినాయుడు,  రెడ్డీస్‌ ల్యాబ్‌ ప్రతినిధి సుమన్‌, సామాజిక కార్యకర్తలు విజయకుమార్‌, సౌమ్య, సీహెచ్‌ అప్పలనాయుడు తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2020-07-11T11:34:06+05:30 IST