డోన్(రూరల్), జనవరి 28: పట్టణంలోని పాతపేట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో చదువుకుంటున్న విద్యార్థి హర్షవర్ధన్‌ను తెలుగు టీచర్ చితకబాదడంతో విద్యార్థి, యువజన సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. తెలుగు టీచర్‌పై శుక్రవారం రాత్రి విద్యార్థుల తల్లిదండ్రులతో కలిసి పట్టణ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఏఐఎస్‌ఎఫ్ జిల్లా ఉపాధ్యక్షులు శివన్న, ఏఐవైఎఫ్ జిల్లా ఆర్గనైజింగ్ కార్యదర్శి పులిశేఖర్‌లు మాట్లాడుతూ విచక్షణారహితంగా విద్యార్థిని చితకబాదిన హైస్కూల్ తెలుగు టీచర్‌ను వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు.