పట్టభద్రుల ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిని గెలిపించాలి

ABN , First Publish Date - 2022-10-04T05:11:06+05:30 IST

త్వరలో జరిగే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నిక ల్లో టీడీపీ అభ్యర్థిని గెలిపించాలని ఆపార్టీ నియోజకవర్గ ఇనచార్జి, మాజీ ఎమ్మెల్యే ఈరన్న, రాష్ట్ర వక్కలిగ సాధికార సమితి కన్వీనర్‌ వీఎం పాండురంగప్ప పిలుపునిచ్చారు.

పట్టభద్రుల ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిని గెలిపించాలి
ఓటరు నమోదుపై అవగాహన కల్పిస్తున్న ఈరన్న

మాజీ ఎమ్మెల్యే మద్దనకుంట ఈరన్న


అగళి, అక్టోబరు 3: త్వరలో జరిగే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నిక ల్లో టీడీపీ అభ్యర్థిని గెలిపించాలని ఆపార్టీ నియోజకవర్గ ఇనచార్జి, మాజీ ఎమ్మెల్యే ఈరన్న, రాష్ట్ర వక్కలిగ సాధికార సమితి కన్వీనర్‌ వీఎం పాండురంగప్ప పిలుపునిచ్చారు. పట్టభద్రుల ఓటర్ల నమోదు కార్యక్రమంలో భాగంగా వారు సోమవారం అగళిలో పర్యటించారు.  నాయకులు, పట్టభద్రులతో చర్చించారు. ఈసందర్భంగా వారు మా ట్లాడుతూ పట్టభద్రులు, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలకు ఓటర్ల న మోదుకు టీడీపీ నాయకులు కృషి చేయాలన్నారు. టీడీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న భూమిరెడ్డి రామ్‌గోపాల్‌రెడ్డిని గెలిపించాలని కోరారు. ఓటర్ల నమోదు ప్రక్రియపై పట్టభద్రులు, టీడీపీ నాయకులకు వివరించారు. జగనరెడ్డి నిరుద్యోగులను మోసం చేశారని, అందులో అధికంగా పట్టభద్రులే ఉన్నారన్నారు. కర్ణాటకలో చదివి మా ప్రాంతం లో ఓటర్లుగా ఉంటే, వారు కూడా ఓటర్లుగా అర్హులన్నారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు, మాజీ సర్పంచు శివలింగప్ప,  మాజీ కో ఆప్షన మెంబర్‌ అలీఖాన, పట్టణ ఎస్సీసెల్‌ అధ్యక్షుడు నాగోజీ, నారాయణప్ప, వార్డుమెంబర్‌ ఉమేష్‌, క్యాతప్ప, నాగరాజు, కసాపురం శ్రీ నివాసులు, శశిధర్‌, సన్న చిక్కప్ప, మడకశిర కన్వీనర్‌ రామాంజనేయులు, తాలూకా రైతు ఉపాధ్యక్షుడు దయానంద, కిష్టప్ప, టీడీపల్లి మంజునాథగౌడ్‌, అచ్చంపల్లి రమేష్‌, నరేష్‌, కరియన్న, శ్రీనివాసులు సన్నప్ప, ఐ-టీడీపీ మండల కోఆర్డినేటర్‌ మహేష్‌ పాల్గొన్నారు.


కార్యకర్తలకు అండగా ఉంటాం..

మడకశిర రూరల్‌: కార్యకర్తలకు తెలుగుదేశం పార్టీ ఎప్పుడూ అండగా ఉంటుందని ఆపాఈ్ట నియోజకవర్గ ఇనచార్జి ఈరన్న తెలిపారు. మండలంలోని బుళ్లసముద్రం మాజీ సర్పంచు జైపాల్‌ ఇటీవ ల రోడ్డు ప్రమాదంలో గాయపడ్డారు. విషయం తెలుసుకున్న ఈర న్న సోమవారం గ్రామానికి వెళ్లి జైపాల్‌ను పరామర్శించారు. ధైర్యం గా కోలుకోవాలన్నారు. కార్యక్రమంలో పార్టీ మండల కన్వీనర్‌ రా మాంజనేయులు, క్రిష్టప్ప, కార్యకర్తలు పాల్గొన్నారు.


Updated Date - 2022-10-04T05:11:06+05:30 IST