వర్గీకరణ బిల్లుకు చట్టబద్ధత కల్పించాలి: ఎమ్మార్పీఎస్‌

ABN , First Publish Date - 2021-10-21T06:04:15+05:30 IST

ఎస్సీ వర్గీకరణ బిల్లుకు చట్టబద్ధత కల్పించాలని ఎమ్మార్పీఎస్‌ ఉమ్మడి జిల్లా కోఆర్డినేటర్‌ యాతాకుల రాజయ్య డిమాండ్‌ చేశారు.

వర్గీకరణ బిల్లుకు చట్టబద్ధత కల్పించాలి: ఎమ్మార్పీఎస్‌
కోదాడలో మహాసభల పోస్టర్‌ను ఆవిష్కరిస్తున్న ఎమ్మార్పీఎస్‌ నాయకులు

సూర్యాపేటటౌన్‌ / కోదాడ /నడిగూడెం / మునగాల / చిలుకూరు / మద్దిరాల / అనంతగిరి, అక్టోబరు 20 : ఎస్సీ వర్గీకరణ బిల్లుకు చట్టబద్ధత కల్పించాలని  ఎమ్మార్పీఎస్‌ ఉమ్మడి జిల్లా కోఆర్డినేటర్‌ యాతాకుల రాజయ్య డిమాండ్‌ చేశారు. ఈ నెల 24న హైదరాబాద్‌లో నిర్వహించే మాదిగ ఉద్యోగుల సమాఖ్య మహాసభల పోస్టర్‌ను ఆయన బుధవారం ఆవిష్కరించి, మాట్లాడారు. కార్యక్రమంలో నాయకులు చింత జాన్‌విల్సన్‌, బోడ శ్రీరాములు, క్రిష్ణ, ప్రభాకర్‌, దున్న శ్యాం పాల్గొన్నారు.  అదేవిధంగా కోదాడ, నడిగూడెం, మునగాల, మద్దిరాల, అనంతగిరి మండలాల్లో మాదిగ ఉద్యోగులు మహాసభ వాల్‌పోస్టర్లను, కరపత్రాలను ఆవిష్కరించారు. కోదాడలో కార్యక్రమాల్లో సమాఖ్య జాతీయ ప్రధాన కార్యదర్శి కత్తి వెంకటేశ్వర్లు, ఏపూరి రాజు, ఏపూరి పర్వతాలు, నడిగూడెంలో రాష్ట్ర ఉపాధ్యక్షుడు సైదులు, ప్రకాష్‌, రాజు, కృష్ణ, శ్రీనివాస్‌, అక్షపతి, నాగరాజు, వెంకటయ్య పాల్గొన్నారు. మునగాలలో రాష్ట్ర నాయకులు పిడమర్తి సైదులు, శ్రీకాంత్‌, శ్రీను, కోటయ్య, వెంకటేశ్వర్లు, జాన్‌సుందర్‌, వెంకన్న, నాగార్జున, ముత్తయ్య పాల్గొన్నారు. చిలుకూరులో ఎమ్మార్పీఎస్‌ జిల్లా ఉపాధ్యక్షుడు వడ్డేపల్లి కోటేష్‌, సైదులు, కందుకూరి రామయ్య, ఏపూరి రాజు పాల్గొన్నారు. మద్దిరాలలో సంఘం మండల అధ్యక్షుడు చిలక శ్రీనివాస్‌, పాల్వాయి వెంకన్న, దాసరి దనుంజయ్‌, మాతంగి వెంకన్న, గోల్కొండ ప్రశాంత్‌ పాల్గొన్నారు. అనంతగిరిలో ఎమ్మార్పీఎస్‌ మండల అధ్యక్షుడు బొడ్డు కుటుంబరావు, నాయకులు బొజ్జ సైదులు పాల్గొన్నారు.  

Updated Date - 2021-10-21T06:04:15+05:30 IST