ప్రజలపై పన్నుల భారం తగదు

ABN , First Publish Date - 2021-06-22T05:53:41+05:30 IST

కరోనా వేళ రాష్ట్ర ప్రభుత్వం ప్రజలపై పన్నుల భారం వేయ డం తగదని వామపక్ష నాయకులు అన్నారు.

ప్రజలపై పన్నుల భారం తగదు
శ్రీకాకుళంలో ధర్నా చేస్తున్న సీపీఐ, సీపీఎం నాయకులు

 గుజరాతీపేట: కరోనా వేళ రాష్ట్ర ప్రభుత్వం ప్రజలపై పన్నుల భారం వేయ డం తగదని వామపక్ష నాయకులు అన్నారు. చెత్త పన్నుతో పాటు మార్కెట్‌ విలువ ఆధారంగా ఇంటి పన్నును విధించడాన్ని వ్యతిరేకిస్తూ శ్రీకాకుళం నగర పాలక సంస్థ కార్యాలయం వద్ద సోమవారం ధర్నా చేపట్టారు. పన్నుల పెంపు  జీవోలను వెంటనే రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు. ఈ నెల 28 వరకు  పోరాటం సాగిస్తామని తెలిపారు కార్యక్రమంలో సీపీఐ, సీపీఎం, జనశక్తి పార్టీల నాయకులు డి.వర్మ, తాండ్ర ప్రకాష్‌, తాండ్ర అరుణ, సన్నశెట్టి రాజశే ఖర్‌, పోలారావు, మార్పు మల్లేశ్వరరావు, బగ్గు భాస్కరరావు, ఎస్‌.కృష్ణవేణి, వై.పద్మావతి తదితరులు పాల్గొన్నారు. పాలకొండ రూరల్‌: ఆస్తి విలువ ఆధారంగా ఇంటి పన్ను విధించే   జీవో 198ను రద్దు చేయా లని సీపీఎం నాయకుడు దావాల రమణరావు డిమాండ్‌చేశారు. సోమవారం పట్టణం లో ఆస్తిపన్ను విధానంలో మార్పునకు, చెత్త పన్ను విధింపునకు నిరసనగా పట్టణ పౌరసమాక్య  కమిటీ ఆధ్వర్యంలో ఇంటింటా కరపత్రాలను పంపిణీ చేశారు.  


 

Updated Date - 2021-06-22T05:53:41+05:30 IST