Abn logo
Sep 24 2021 @ 00:55AM

ఎంఈవో, హెచ్‌ఎంపై సస్పెషన్‌ ఎత్తివేయాలి

వినతిపత్రం అందిస్తున్న జాక్టో యూఎస్‌పీసీ నాయకులు

జిల్లా జాక్టో, యూఎస్‌పీసీ ఉపాధ్యాయ సంఘాల డిమాండ్‌ 

డీఈవో కార్యాలయం ఎదుట ధర్నా - వినతి  

జగిత్యాల అర్బన్‌, సెప్టెంబరు 23: కోరుట్ల మండలం యెఖీన్‌పూర్‌ గ్రామంలోని ప్రాథమిక పాఠశాల హెచ్‌ఎం, కోరుట్ల మండల ఎంఈవోపై పెట్టిన సెస్పషన్‌ను ఎత్తివేయాలని జిల్లా జాక్టో, యూఎస్‌పీసీ ఉపాధ్యాయ సంఘాల నాయకులు డిమాండ్‌ చేశారు. జిల్లా కేంద్రంలోని స్థానిక జిల్లా విద్యాశాఖ కార్యాలయం ఎదుట నిరసన ప్రదర్శన నిర్వహించి, అ నంతరం కార్యాలయ అధికారికి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భం గా జాక్టో, యూఎస్‌పీసీ ఉపాధ్యాయ సంఘాల నాయకులు మాట్లాడు తూ విద్యార్థులను ఫీజులను అడిగారనే నెపంతో పాఠశాల హెచ్‌ఎంతో పాటు ఎంఈవోను సస్పెండ్‌ చేయడం దారుణం అన్నారు. గ్రామ అభివృ ద్ధి కమిటీ, పేరెంట్స్‌ కమిటీ తీర్మానం చేసుకుని, అదనంగా పాఠశాలకు అవసరమైన ఉపాధ్యాయులను (వాలంటీర్ల)ను నియమించుకున్నారు. ఎస్‌ఎంసీ నిర్ణయం మేరకే కమిటీ సభ్యులు వారే వసూలు చేస్తూ ఆ ఇద్దరు వలంటీర్లకు జీతభత్యాలు చెల్లిస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య గణనీయంగా పెరిగిందన్నారు. దీంతో అవసరమైన సిబ్బందిని నియమించుకుంటే ఉపాధ్యాయులను బలి చేయడం దారుణం అన్నారు. వెనువెంటనే సస్పెషన్స్‌ ఎత్తివేయాలని డిమాండ్‌ చేశారు. ఈ నిరసన కార్యక్రమంలో రఘుశంకర్‌ రెడ్డి, గంగాధర్‌, చంద్రమౌళి, హరికిరణ్‌, శ్యాంసుందర్‌, రమేష్‌, రాంరెడ్డి, రాజబాబు, శంకర్‌, నరేంధర్‌, జయంత్‌, గంగారాజం, రాంచంద్రం, గోవర్ధన్‌, సుదర్శన్‌రెడ్డి, హరికృష్ణ తదితరులున్నారు.