సంపద పెంచితేనే దేశం మనుగడ

ABN , First Publish Date - 2022-08-11T06:01:03+05:30 IST

దేశ సంపదను పెంచితేనే దేశం మనుగడ సాధిస్తుందని నమ్మిన ఏకైక వ్యక్తి సీఎం కేసీఆర్‌ అని మెదక్‌ ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి అన్నారు.

సంపద పెంచితేనే దేశం మనుగడ
దుబ్బాకలో జాతీయ జెండాలను పంపిణీ చేస్తున్న మెదక్‌ ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి

మెదక్‌ ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి

పలు మండలాల్లో వన మహోత్సవ కార్యక్రమాలు

దుబ్బాక, ఆగస్టు 10: దేశ సంపదను పెంచితేనే దేశం మనుగడ సాధిస్తుందని నమ్మిన ఏకైక వ్యక్తి సీఎం కేసీఆర్‌ అని మెదక్‌ ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి అన్నారు. బుధవారం దుబ్బాకలోని అంబేడ్కర్‌ కాలనీలో జాతీయ జెండాలను ఎగురవేసి మాట్లాడారు. దేశ స్వాతంత్య్ర ఉద్యమానికి గాంధీ చరక(రాట్నం) ఒక స్ఫూర్తియని, అదే స్ఫూర్తితో సీఎం కేసీఆర్‌ తెలంగాణ ఉద్యమాన్ని అహింసాయుతంగా నడిపారన్నారు. అనంతరం సీఎం రిలీఫ్‌ ఫండ్‌ చెక్కులను పంపిణీ చేశారు. 

దుబ్బాక/మిరుదొడ్డి: దుబ్బాక, మిరుదొడ్డి, నూతనంగా ఏర్పాటైన అక్బర్‌పేట భూంపల్లి ఎక్స్‌రోడ్‌ మండల కేంద్రాల్లో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు బాలే్‌షగౌడ్‌, జిల్లా ప్రధాన కార్యదర్శి రోశయ్య, నియోజకవర్గ కన్వీనర్‌ ఎస్‌ఎన్‌ చారి జాతీయ జెండాలను ద్విచక్ర వాహనాలకు కట్టుకుని ప్రధాన వీధుల గుండా ర్యాలీ నిర్వహించారు. అలాగే దుబ్బాక సినిమా థియేటర్‌లో మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ గన్నె వనితాభూంరెడ్డి, మిరుదొడ్డి ఎంపీపీ సాయిలు విద్యార్థులతో కలిసి సినిమాను వీక్షించారు. అలాగే మిరుదొడ్డి మండలం ధర్మారం గ్రామంలో ఫ్రీడమ్‌ పార్కులో అధికారులతో కలిసి మొక్కలు నాటారు. 

చిన్నకోడూరు: జాతీయ సమైక్యతను చాటేలా స్వాతంత్య్ర వజ్రోత్సవ సంబరాలు నిర్వహించాలని జడ్పీ చైర్‌పర్సన్‌ రోజాశర్మ అన్నారు. బుధవారం మండలంలోని గోనెపల్లి, రామునిపట్ల గ్రామాల్లో మొక్కలు నాటి, గ్రామస్థులకు జాతీయ జెండాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ మాణిక్యరెడ్డి, వైస్‌ ఎంపీపీ పాపయ్య, టీఆర్‌ఎస్‌ మండలాధ్యక్షుడు శ్రీనివాస్‌ తదితరులు పాల్గొన్నారు. అలాగే చిన్నకోడూరు మండలం ఇబ్రహీంనగర్‌ మోడల్‌ స్కూల్‌కు చెందిన 218 మంది విద్యార్థినులు, 139 మంది విద్యార్థులకు బుధవారం సిద్దిపేట పట్టణంలోని బాలాజీ సినిమా థియేటర్‌లో గాంధీ సినిమాను పాఠశాల ప్రిన్సిపాల్‌ పద్మలత, ఉపాధ్యాయులు వీక్షింపజేశారు. 

చిన్నకోడూరు: చిన్నకోడూరు మండలంలో బీజేపీ మండలాధ్యక్షుడు పిట్ల పరశురాములు జాతీయ జెండాలను నాయకులకు పంపిణీ చేశారు. 

మద్దూరు: మద్దూరు మండల కేంద్రంలో స్వతంత్ర భారత వజ్రోత్సవాలను పురస్కరించుకుని ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి ఎంపీపీ బద్దిపడిగె కృష్ణారెడ్డితో కలిసి పీహెచ్‌సీలో ఏర్పాటు చేసిన వనమహోత్సంలో మొక్కలు నాటి, పలువురికి జాతీయ జెండాలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో దూళిమిట్ట, మద్దూరు మండల పార్టీ అధ్యక్షులు మేక సంతోష్‌, మంద యాదగిరి, ఎంపీడీవో శ్రీనివాస్‌ పాల్గొన్నారు. 

చేర్యాల: చేర్యాల మండలం వీరన్నపేట గ్రామశివారులో చేపట్టిన వన మహోత్సవంలో ఎమ్మెల్యే ముత్తిరె డ్డి యాదగిరిరెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా జనగామ-సిద్దిపేట ప్రధాన రహదారి పక్కన ఇరువైపులా మొక్కలు నాటి జాతీయ పతాకాలను ఏర్పాటుచేశారు. చేర్యాల మునిసిపల్‌ ఆధ్వర్యంలో కుడిచెరువు సమీపంలో ఫ్రీడమ్‌ పార్కును ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో మునిసిపల్‌ చైర్‌పర్సన్‌ స్వరూపారాణి, కమిషనర్‌ రాజేంద్రకుమార్‌ పాల్గొన్నారు. అలాగే చేర్యాల మండలం వేచరేణి శివారు ఎల్లదాసునగర్‌ కాలనీలో వన మహోత్సవం చేపట్టారు. తాడూరులో సర్పంచ్‌ నర్ర ప్రేమల ఆధ్వర్యంలో జాతీయ జెండాలను పంపిణీ చేశారు. కొమురవెల్లిలో ఎంపీపీ తలారి కీర్తన, జడ్పీటీసీ సిలివేరు సిద్ధప్ప, ఎంపీడీవో కేవీఎల్‌ అనురాధ, సర్పంచ్‌ సార్ల లత, ఎస్‌ఐ చంద్రమోహన్‌ తదితరులు జాతీయ పతాకాల పంపిణీ ప్రారంభించారు. 

బెజ్జంకి: బెజ్జంకి మండలం రేగులపల్లి గ్రామంలో నిర్వహించిన వన మహోత్సవంలో మానకొండూరు ఎమ్మెల్యే రసమయి బాలకిషన్‌ స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి బుధవారం మొక్కలు నాటారు. అనంతరం గ్రామపంచాయతీ ఆవరణలో జాతీయ జెండాలను పంపిణీ చేశారు. 

గజ్వేల్‌ రూరల్‌: గజ్వేల్‌ మండలం అక్కారం గ్రామంలో ఎమ్మెల్సీ యాదవరెడ్డి, ఎఫ్‌డీసీ చైర్మన్‌ వంటేరు ప్రతా్‌పరెడ్డి మొక్కలు నాటారు. 

సిద్దిపేట క్రైం: సిద్దిపేటలోని పోలీస్‌ కమిషనర్‌ కార్యాలయ ఆవరణలో, సీఏఆర్‌ హెడ్‌ క్వార్టర్‌లో సీపీ శ్వేత మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో అదనపు డీసీపీ అడ్మిన్‌ మహేందర్‌, ఏఆర్‌ అదనపు డీసీపీ లు రాంచంద్రరావు, సుభా్‌షచంద్రబోస్‌ తదితరులు పాల్గొన్నారు. స్వతంత్ర వజ్రోత్సవ కార్యక్రమాలను ఘనంగా నిర్వహించాలని సీపీ శ్వేత అన్నారు. బుధవారం జిల్లా పోలీస్‌ అధికారులతో కమిషనర్‌ కార్యాలయంలో సమీక్షా సమావేశం నిర్వహించి మాట్లాడారు. అదేవిధంగా సిద్దిపేట పోలీస్‌ కమిషనరేట్‌ పరిధిలో పనిచేస్తున్న పోలీస్‌ అధికారులు, కమిషనర్‌ కార్యాలయంలో పనిచేస్తున్న సిబ్బందితో హర్‌ దిల్‌ పే తిరంగ్‌ (ప్రతి హృదయంపైన జాతీయ జెండా) కార్యక్రమాన్ని సీపీ నిర్వహించారు. సిద్దిపేట పట్టణంలోని బాలాజీ సినిమా థియేటర్‌ను కలెక్టర్‌ ప్రశాంత్‌ జీవన్‌ పాటిల్‌, సీపీ శ్వేత, అదనపు కలెక్టర్‌ ముజామిల్‌ఖాన్‌ సందర్శించి విద్యార్థుల కోసం ఉచితంగా ప్రదర్శిస్తున్న గాంధీ సినిమాను కొద్దిసేపు తిలకించారు. ఆయన వెంట విద్యాశాఖ అధికారులు, ఏఎస్పీ మహేందర్‌ పాల్గొన్నారు. సిద్దిపేట ట్రాఫిక్‌ ఏసీపీ ఫణిందర్‌ ఆధ్వర్యంలో సిద్దిపేట టూ టౌన్‌, రూరల్‌ పోలీ్‌సస్టేషన్‌ ఆవరణలో మొక్కలు నాటారు. 

హుస్నాబాద్‌: హుస్నాబాద్‌ పట్టణంలోని పోలీ్‌సస్టేషన్‌, పోలీసు డివిజన్‌ కార్యాలయంలో ఏసీపీ సతీష్‌, మినీ స్టేడియంలో చైర్‌పర్సన్‌ ఆకుల రజిత 75 మొక్కలను నాటారు. ఈ కార్యక్రమంలో కమిషనర్‌ రాజమల్లయ్య, వైస్‌ చైర్‌పర్సన్‌ అయిలేని అనిత పాల్గొన్నారు. 

ములుగు: ములుగు ఫారెస్ట్‌ కళాశాలలో స్వాతంత్య్ర వజ్రోత్సవాలను పురస్కరించుకుని నిర్వహించిన వనమహోత్సవంలో రాష్ట్ర స్కిల్‌ డెవల్‌పమెంట్‌ అడ్వైజర్‌ బీపీ ఆచార్య పాల్గొని మొక్కలు నాటారు. 

హుస్నాబాద్‌ రూరల్‌: హుస్నాబాద్‌ మండలం జిల్లెలగడ్డలో ఫ్రీడమ్‌ పార్కును ఏర్పాటు చేసి మొక్కలు నాటారు. 

అక్కన్నపేట: అక్కన్నపేట మండల కేంద్రంతో పాటు చౌటపల్లి, మోత్కులపల్లి తదితర గ్రామాల్లో ఫ్రీడమ్‌ పార్కును ఏర్పాటు చేసి మొక్కలు నాటారు. అనంతరం జాతీయ జెండాలను ఎగురవేశారు. 

సిద్దిపేట రూరల్‌: సిద్దిపేట రూరల్‌ మండలంలోని రావురుకుల గ్రామంలో ఫ్రీడమ్‌ పార్కులో సుడా చైర్మన్‌ మారెడ్డి రవీందర్‌రెడ్డి బుధవారం మొక్కలు నాటారు. అనంతరం జాతీయ జెండాలను పంపిణీ చేశారు. రాఘవాపూర్‌లో సర్పంచ్‌ ఏర్వ రమేష్‌ ఆధ్వర్యంలో ఎంపీపీ శ్రీదేవి చందర్‌రావు జాతీయ జెండాలు, మొక్కలు పంపిణీ చేశారు. ఇర్కోడ్‌లోని మోడల్‌ స్కూల్‌లో విద్యార్థులు మొక్కలు నాటారు. 

కోహెడ: కోహెడ మండలం బస్వాపూర్‌లో ఎంపీపీ కొక్కుల కీర్తి సురేష్‌ తమ ఇంటిపై జాతీయ జెండాను ఎగురవేశారు. అలాగే గుండారెడ్డిపల్లిలో వన మహోత్సవంలో భాగంగా సర్పంచ్‌ అశోక్‌రెడ్డి, ఎంపీటీసీ కల్యాణి మొక్కలు నాటారు. 

తొగుట: తొగుట మండలంలో బీజేపీ మండలాధ్యక్షుడు చిక్కుడు చంద్రం ఆధ్వర్యంలో నాయకులు హర్‌ గర్‌ తిరంగ్‌ బైక్‌ ర్యాలీ నిర్వహించారు. అలాగే మండలంలోని వివిధ గ్రామాల్లో అధికారులు, ప్రజాప్రతినిధులు మొక్కలు నాటారు. ఎల్లారెడ్డిపేట ప్రకృతివనానికి డాక్టర్‌ అంబేడ్కర్‌ ఫ్రీడమ్‌ పార్కుగా, రాంపూర్‌ పల్లె ప్రకృతివనానికి సుభాష్‌ చంద్రబోస్‌ ఫ్రీడమ్‌ పార్కుగా నామకరణం చేశారు. 

రాయపోల్‌: రాయపోల్‌ మండలంలోని ఆయా గ్రామాల్లో అధికారులు, పోలీసులు, ప్రజాప్రతినిధులు మొక్కలు నాటారు. వడ్డేపల్లి పాఠశాలలో సర్పంచ్‌ బచ్చు చంద్రశేఖర్‌, ఉపాధ్యాయులు జాతీయ జెండాలను ప్రదర్శించారు.

దౌల్తాబాద్‌: దౌల్తాబాద్‌ మండలంలోని ఎంపీడీవో కార్యాలయంలో ఎంపీపీ గంగాధర్‌సంధ్య, జడ్పీటీసీ రణం జ్యోతి బుధవారం మొక్కలు నాటారు. అనంతరం పంచాయతీ కార్యదర్శులకు జాతీయ జెండాలను పంపిణీ చేశారు. 

వర్గల్‌: వర్గల్‌ మండల కేంద్రంలో ఎంపీపీ జాలిగామ లత, జడ్పీటీసీ బాలుయాదవ్‌ మొక్కలు నాటారు. అలాగే జ్యోతిబాఫూలే మహిళా గురుకుల డిగ్రీ కళాశాలలో ప్రిన్సిపాల్‌ వెంకటేశ్వరావు, ఉమామహేశ్వరి, విద్యార్థులు మొక్కలు నాటారు. 

నారాయణరావుపేట: నారాయణరావుపేట మండలంలోని ఆయా గ్రామాల్లో వనమహోత్సవంలో సర్పంచుల ఫోరం అధ్యక్షుడు శాతారాజుపల్లి ఆంజనేయులు జాతీయ జెండాలను పంపిణీ చేశారు.  

రాజ్యాంగ పుస్తకాలను పంపిణీ చేయాలి

నంగునూరు, ఆగస్టు 10: ప్రతి ఇంటికో జెండా కాదు భారత రాజ్యాంగ పుస్తకాలు పంపిణీ చేయాలని టీపీసీసీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి దేవులపల్లి యాదగిరి ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. బుధవారం నంగునూరులో విలేకరులతో మాట్లాడారు. 



Updated Date - 2022-08-11T06:01:03+05:30 IST