రైతు సమస్యలు పరిష్కరించకుంటే ప్రభుత్వాల మనుగడ ప్రశ్నార్థకమే

ABN , First Publish Date - 2021-11-27T05:25:32+05:30 IST

రైతు సమస్యలు ప రిష్కరించకుంటే రాబోయే రోజుల్లో ప్రభుత్వాల మనుగడ ప్ర శ్నార్థకయ్యేలా కార్యాచరణకు రైతాంగం సిద్ధం కావాల్సి వస్తుం దని జిల్లా రైతు ఐక్యవేదిక అధ్యక్షుడు పన్నాల తిరుపతి రెడ్డి ఉభయ ప్రభుత్వాలను హెచ్చరించారు.

రైతు సమస్యలు పరిష్కరించకుంటే ప్రభుత్వాల మనుగడ ప్రశ్నార్థకమే
కలెక్టరేట్‌కు ర్యాలీగా వెళ్తున్న రైతులు

 రైతు ఐక్యవేదిక జిల్లా అధ్యక్షుడు పన్నాల తిరుపతి రెడ్డి 

కలెక్టరేట్‌ ఎదుట రైతుల ధర్నా

జగిత్యాల అగ్రికల్చర్‌, నవంబరు 26: రైతు సమస్యలు ప రిష్కరించకుంటే రాబోయే రోజుల్లో ప్రభుత్వాల మనుగడ ప్ర శ్నార్థకయ్యేలా కార్యాచరణకు రైతాంగం సిద్ధం కావాల్సి వస్తుం దని జిల్లా రైతు ఐక్యవేదిక అధ్యక్షుడు పన్నాల తిరుపతి రెడ్డి ఉభయ ప్రభుత్వాలను హెచ్చరించారు. జిల్లా రైతు ఐక్యవేదిక ఆధ్వర్యంలో చలో జగిత్యాల పేరుతో రైతు సమస్యల పరిష్కా రానికి పట్టణంలోని స్థానిక పాత బస్టాండ్‌ నుంచి తహసీల్‌ చౌరస్తా, కొత్త బస్టాండ్‌ మీదుగా కలెక్టరేట్‌ కార్యాలయం వర కు ర్యాలీ నిర్వహించి, కలెక్టరేట్‌ ఎదుట ఽమహాధర్నా నిర్వహిం చారు. ఈ సందర్భంగా తిరుపతి రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో  రైతుల దుస్థితి అత్యంత దయనీయంగా మారిందన్నారు. ఓ వైపు పకృతి కన్నెర్ర చేసి పంటలను నష్టం చేస్తుంటే, మరో వైపు పంటలను కొనలేక కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పరిహా సమాడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. వానాకాలం వరి ధాన్యం కల్లాల్లో పోసి నెల రోజులకు చేరువైన ధాన్యాన్ని కొనే నాధుడే లేడన్నారు. ప్రభుత్వం వరిపంటను వెయవద్దని సూ చించడం రైతులకు ఆందోళన కలిగిస్తోందన్నారు. రాష్ట్ర ప్రభు త్వం ప్రత్యామ్నాయ పంటల సాగు విషయంలో రైతులకు స్ప ష్టతనిస్తూ, వరి, మొక్కజొన్న, నువ్వులు వంటి సాంప్రదాయ సాగుకు అవకాశం ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. తప్ప, తాలు, మాయిశ్చర్‌ పేరుతో మిల్లర్లు రైతులను నిండా ముంచుతూ దోపిడీకి గురి చేస్తున్నా, అధికారులు మిల్లర్లపై ఎలాంటి చర్య లు తీసుకోవడం లేదని ఆరోపించారు. వరి సాగును తగ్గిం చేందుకు చెరుకు ఫ్యాక్టరీ తెరిపించాలని, చెరుకు ఫ్యాక్టరీ అ రంభంతో వరితో పాటు, మొక్కజొన్న సాగును నియంత్రణ లోకి తీసుకురావచ్చని సూచించారు. రైతులు పండించిన పం టలను మద్దతు ధర కల్పించి కోనుగోలు చేయడం కేంద్ర రా ష్ట్ర ప్రబుత్వాల బాధ్యత అని, మద్దతు ధర కల్పించి రైతుల పంటలను కొనుగోలు చేయాలన్నారు. కేంద్ర ప్రభుత్వం పసు పు పంట మద్దతు ధర కల్పిస్తే, రాష్ట్ర ప్రభు త్వం బోనస్‌ ప్రక టించాలని తిరుపతిరెడ్డి డిమాండ్‌ చేశారు. రైతులు చేస్తున్న ఈ పోరాటానికి ఏ రాజకీయ రంగు పుల మద్దని, రైతులుగా తమ హక్కుల కోసం పోరాటం చేస్తున్నామే తప్ప, ప్రభుత్వా లను నిందించాలని కాదనే విషయాన్ని గుర్తెరుగాలన్నారు. జిల్లా నలుమూలల నుంచి రైతులు భారీ సంఖ్యలో తరలి వచ్చి, ధర్నాలో పాల్గొన్నారు. రైతుల మహా ఽధర్నా నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగ కుండా సీఐ కిషోర్‌ ఆధ్వర్యంలో, ఎస్‌ఐలు శంకర్‌ నాయక్‌, ఎస్సైలు అశోక్‌, రవి, నవత గట్టి బందోబస్తు నిర్వహించారు. దళిత సంఘాల నా యకులు పాల్గొన్నారు. ధర్నా అనంతరం కలెక్టరేట్‌ కార్యాలయ అధికారికి రైతులు వినతిపత్రం సమర్పించి, సమస్యలు పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు. 

ధర్నాలో రైతు ఆత్మహత్యాయత్నం 

రైతు సమస్యల పరిష్కారం, పండించిన పంటలకు మద్ద తు ధర కల్పించాలనే డిమాండ్‌తో జిల్లా రైతు ఐక్యవేదిక చేప ట్టిన రైతుల ర్యాలీ, మహాధర్నా కార్యక్రమం ఉద్రిక్తతకు దారి తీసింది. స్థానిక పాత బస్టాండ్‌ నుంచి కలెక్టరేట్‌ కార్యాలయం వరకు ర్యాలీ శాంతియుతంగానే సాగింది. కలెక్టరేట్‌ ఎదుట ఽధర్నాకు కూర్చున్న రైతులు ప్రభుత్వ తీరును నిరసిస్తూ ని నదించారు. రెండు మూడు గంటలుగా ధర్నా సాగుతున్న కలె క్టర్‌ గానీ, సివిల్‌ సప్లై అధికారులు, జిల్లా అధికార యంత్రాం గం గానీ పట్టించుకోకపోవడంతో అధికారుల తీరుపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కలెక్టర్‌ రావాలి... ఎమ్మెల్సీ కలెక్టర్‌ అంటూ సిద్దిపేట కలెక్టర్‌ను ఉద్దేశించి, తమను జగిత్యాల క లెక్టర్‌ పట్టించుకోవడం లేదంటూ రైతులు నినాదాలు చేశా రు. అధికారుల తీరుపై అసహనానికి గురైన జగిత్యాల రూర ల్‌ మండలం ధర్మారం గ్రామానికి చెందిన మల్లేశ్‌ అనే యు వరైతు డీజిల్‌ పైన పోసుకుని ఆత్మహత్యాయత్నానికి ప్రయ త్నించాడు. రైతులు, పోలీసులు వెంటనే క్యాన్‌ను లాక్కోవడంతో ప్రమాదం తప్పింది. పోలీసులకు, రైతులకు మధ్య తో పులాట జరిగింది. ఈ ఘటనతో అధికారుల తీరుపై రైతులు తీవ్ర అసహ నం వ్యక్తం చేశారు.      


Updated Date - 2021-11-27T05:25:32+05:30 IST