Abn logo
Sep 17 2020 @ 04:43AM

పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలి

చైర్‌పర్సన్‌ ముల్లి పావని


ఘట్‌కేసర్‌: పరిసరాల పరిశుభ్రత కోసం ప్రతి ఒక్కరూ పాటుపడాలని ఘట్‌కేసర్‌ మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ ముల్లి పావని జంగయ్య యాదవ్‌ అన్నారు. బుధవారం ఘట్‌కేసర్‌లోని కరీంగూడ రోడ్డులో స్వచ్ఛ సర్వేక్షణ్‌ కార్యక్రమంలో భాగంగా నిర్వహిస్తున్న పారిశుధ్య పనులను ఆమె తనిఖీ చేశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ ప్రతివార్డును పరిశుభ్రంగా ఉంచుకోవడానికి సిబ్బంది కృషి చేయాలన్నారు. ప్రధానంగా  వీదుల్లో చెత్తాచెదారం పేరుకుపోకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. అనంతరం పారిశుధ్య సిబ్బంది జాబితాను పరిశీలించారు. కార్యక్రమంలో సిబ్బంది, స్థానికులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement