సాయితేజ్ ఆరోగ్యం నిలకడగా ఉందని ఆదివారం అపోలో ఆస్పత్రి వైద్యులు ఓ ప్రకటన విడుదల చేశారు. క్రమక్రమంగా ఆరోగ్యం మెరుగవుతోందని అందులో పేర్కొన్నారు. శుక్రవారం రాత్రి సాయితేజ్ రోడ్డు ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. ఆయనకు గాయాలు కాగా, కాలర్ బోన్ శస్త్ర చికిత్సను విజయవంతంగా పూర్తి చేసినట్టు వైద్యులు తెలిపారు. అనుభవజ్ఞులైన వైద్యులు నిరంతరం సాయితేజ్ ఆరోగ్యాన్ని పర్యవేక్షిస్తున్నట్టు వెల్లడించారు.