ఎండ ప్రచండం

ABN , First Publish Date - 2022-05-02T05:35:26+05:30 IST

ఉమ్మడి జిల్లాపై భానుడు తన ప్రతాపాన్ని చూపుతున్నాడు. రెండు రోజులుగా క్రమంగా ఎండలు పెరుగుతున్నాయి.

ఎండ ప్రచండం

ఉమ్మడి జిల్లాలో పెరుగుతున్న ఉష్ణోగ్రతలు  

అత్యధికంగా బెజ్జంకిలో 44.8, సదాశివపేటలో 43.6, 

పెద్దశంకరంపేటలో 43.4 డిగ్రీల సెల్సీయస్‌ నమోదు


మెదక్‌ అర్బన్‌, మే1: ఉమ్మడి జిల్లాపై భానుడు తన ప్రతాపాన్ని చూపుతున్నాడు. రెండు రోజులుగా క్రమంగా ఎండలు పెరుగుతున్నాయి. అత్యధికంగా సిద్దిపేట జిల్లా బెజ్జంకిలో 44.8 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. సదాశివపేటలో 43.6 డిగ్రీలు, మెదక్‌ జిల్లా పెద్దశంకరంపేటలో 43.4 డిగ్రీల సెల్సీయస్‌ నమోదైంది. రాబోయే రోజుల్లో 45 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశాలు ఉన్నాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణశాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు.

రికార్డుస్థాయి ఉష్ణోగ్రతలు

సిద్దిపేట జిల్లా బెజ్జంకిలో అత్యధికంగా 44.8, పెద్దకోడూర్‌ 44.5, కట్కూర్‌ 44.3, తుక్కాపూర్‌ 44.0, చిట్యాల 43.8, రాంపూర్‌ 43,6, ముస్తాల్య 43.2,  తిమ్మరెడ్డిపల్లిలో 43.0 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఇక సంగారెడ్డి జిల్లా సదాశివపేటలో 43.6 డిగ్రీలు, గుండ్లమాచనూర్‌ 42.9, సిర్గాపూర్‌, కల్హేర్‌, కందిలో 42.8, హత్నూరలో 42.6, ముక్తాపూర్‌లో 42.2 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.  ఇక మెదక్‌ జిల్లా పెద్దశంకరంపేట 43.6 డిగ్రీలు, నాగాపూర్‌ 42.9, చిట్కుల్‌లో 42.7, మిన్పూర్‌లో 42.5, బోడగట్‌లో 42.3, వాడీ 42.2, పోడ్చన్‌పల్లిలో 42.0 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. రోజురోజుకు పెరుగుతున్న ఎండలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. రోడ్లన్నీ నిర్మానుష్యంగా కనిపిస్తున్నాయి. 


ప్రజలు అప్రమత్తంగా ఉండాలి 

- హన్మంతరావు, కలెక్టర్‌, సంగారెడ్డి

 ఉష్ణోగ్రతలు రోజురోజుకు అధికమవుతున్న తరుణంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి.   జనసంచారం అధికంగా ఉన్న చోట చలివేంద్రాలను ఏర్పాటు చేయాలి. సరిపడా ఓఆర్‌ఎస్‌  ప్యాకెట్లను అన్ని ఆరోగ్యకేంద్రాల్లో అందుబాటులో ఉంచాలి. హరితహారంలో నాటిన మొక్కల క్రమం తప్పకుండా నీరు పోయాలన్నారు. పశువుల దాహర్తి తీర్చేలా తగుచర్యలు చేపట్టాలి. 


ద్రవ పదార్థాలు ఎక్కువగా తీసుకోవాలి

- వెంకటేశ్వర్‌రావు , డీఎంహెచ్‌వో, మెదక్‌

ఉష్ణోగ్రతలు పెరుగుతున్న నేపథ్యంలో సాధ్యమైనం త వరకు ఉదయం 9 గంటల తర్వాత బయటకు రాకపోవడం మంచింది. బయట దొరికే శీతల పానీయాల విషయంలో జాగ్రతగా ఉండాలి. పలుచని దుస్తులు ధరించాలి. అధిక ద్రవ పదార్ధాలు తీసుకోవడం ద్వారా కొంత వరకు ఉపశమనం కలుగుతుంది. వృద్ధులు, చిన్నారులు వేసవిలో చాలా జాగ్రత్తగా ఉండాలి. 



Updated Date - 2022-05-02T05:35:26+05:30 IST