భానుడి భగభగలు

ABN , First Publish Date - 2020-05-22T09:34:53+05:30 IST

జిల్లాలో ఎండలు మండిపోతున్నాయి. ఈనెల 22 నుంచి 25 వరకు మరింత ఉగ్రరూపం

భానుడి భగభగలు

అమలాపురం, మే 21 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో ఎండలు మండిపోతున్నాయి. ఈనెల 22 నుంచి 25 వరకు మరింత ఉగ్రరూపం దాల్చే అవకాశం ఉన్న దృష్ట్యా ప్రజలు అప్రమత్త తతో ఉండాలని భారత వాతావరణశాఖ హెచ్చరికలు జారీ చేసింది. గురువారం జిల్లావ్యాప్తంగా 41 నుంచి 42 డిగ్రీల ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయిలో నమోదయ్యాయి. తుపాను తీరం దాటినా వాతావరణంలో తేమశాతం తగ్గి ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయిలో నమోదవుతాయని, 25వ తేదీ వరకు ఈ ఉష్ణోగ్రతలు 45 నుంచి 47 డిగ్రీల వరకు కొనసాగవచ్చునని వాతావరణశాఖ హెచ్చరించింది.


కోస్తా జిల్లాల్లో ఉష్ణోగ్రతల తీవ్రత ఎక్కువగా ఉంటుందని, దీని దృష్ట్యా ప్రజలు బయ టకు రాకుండా ఇళ్లకే పరిమితం కావలసిందిగా అధికారులు హెచ్చరిస్తున్నారు. అందువల్ల మంచినీళ్లు, మజ్జిగ, కొబ్బరి నీళ్లు, ఓఆర్‌ఎస్‌ ప్యాకెట్లు వంటివాటిని ఎక్కువగా విని యోగించుకుంటే మంచిదని సూచించారు. కాగా బుధ, గురు వారాల్లో అధిక ఉష్ణోగ్రతలు నమోదు కావడంతో ప్రజలు సైతం రోడ్లపైకి రాలేని పరిస్థితి కనిపించింది. దీనికితోడు విద్యుత్‌ సరఫరాలో తీవ్రమైన అంతరాయం కలిగింది. బుధవారం రాత్రి 9 గంటల నుంచి ఆరున్నర గంటలపాటు అమలాపురంలోని నల్లవంతెన, బాలయోగిఘాట్‌, మెయిన్‌ రోడ్డు, మెట్లకాలనీ వంటి ప్రాంతాల్లో విద్యుత్‌ సరఫరాకు అంతరాయం ఏర్పడడంతో ప్రజలు ఇబ్బందులు పడ్డారు.

Updated Date - 2020-05-22T09:34:53+05:30 IST