May 6 2021 @ 00:15AM

స్టుపిడ్‌ కరోనా పోయింది

అభిమానులకు పూజాహెగ్డే శుభవార్త చెప్పారు. తనకు కొవిడ్‌ నెగెటివ్‌ వచ్చినట్టు బుధవారం పూజ ట్విట్టర్లో తెలిపారు. ‘మీ ప్రేమకు ధన్యవాదాలు. ప్రస్తుతం నేను కోలుకున్నాను. స్టుపిడ్‌ కరోనా పోయింది. వైద్య పరీక్షలో కొవిడ్‌ నెగెటివ్‌ వచ్చింది. వైద్యం, మీ ప్రార్థనల శక్తి ఫలించింది. మాస్క్‌ ధరించి, అందరూ సురక్షితంగా ఉండండి’’ అని ట్వీట్‌ చేశారు. ఏప్రిల్‌ 25న కరోనా పాజిటివ్‌గా తేలినప్పటి నుంచి పూజాహెగ్డే స్వీయ గృహ నిర్భందంలో ఉండి చికిత్స తీసుకున్నారు. ప్రస్తుతం ఆమె ప్రభాస్‌తో ‘రాధేశ్యామ్‌’, రామ్‌చరణ్‌తో ‘ఆచార్య’, అఖిల్‌తో ‘మోస్ట్‌ ఎలిజబుల్‌ బ్యాచ్‌లర్‌’ చిత్రాల్లో నటిస్తున్నారు. హిందీలో ‘సర్కస్‌’ తమిళంలో విజయ్‌తో ఓ చిత్రంలో నటిస్తున్నారు.