తాడిపత్రిలో బలవంతుడైన వైసీపీ ఎమ్మెల్యేదే రాజ్యం : జేసీ

ABN , First Publish Date - 2021-07-26T06:10:30+05:30 IST

పట్టణంలో బలవంతుడిదే రాజ్యంగా అనిపించుకొనేందుకు వైసీపీ ఎమ్మెల్యే పెద్దారెడ్డి ప్రయత్నిస్తున్నారని టీడీపీ మున్సిప ల్‌ చైర్మన్‌ జేసీ ప్రభాకర్‌రెడ్డి విమర్శించారు.

తాడిపత్రిలో బలవంతుడైన వైసీపీ ఎమ్మెల్యేదే రాజ్యం : జేసీ
మాట్లాడుతున్న మున్సిపల్‌ చైర్మన్‌ జేసీ ప్రభాకర్‌ రెడ్డి

తాడిపత్రి, జూలై 25: పట్టణంలో బలవంతుడిదే రాజ్యంగా అనిపించుకొనేందుకు వైసీపీ ఎమ్మెల్యే పెద్దారెడ్డి ప్రయత్నిస్తున్నారని టీడీపీ మున్సిప ల్‌ చైర్మన్‌ జేసీ ప్రభాకర్‌రెడ్డి విమర్శించారు. స్థానిక సీపీఐకాలనీలో ఉన్న సీపీఐకి చెందిన రంగయ్య కుటుంబాన్ని ఆయన ఆదివారం పరామర్శించా రు. అనంతరం జేసీపీఆర్‌ విలేకరులతో మాట్లాడారు. ఆర్డీటీ కాలనీలో 87 ఇళ్లు కొట్టేందుకు మద్దతు ఇవ్వాలని ఎమ్మెల్యే కోరడంతో.. తాను మద్దతు ఇ చ్చానన్నారు. కానీ మూడు ఇళ్లు మాత్రం అక్కడ ఎందుకు కొట్టలేదని ప్ర శ్నించారు. భయబ్రాంతులు చేసేందుకు అక్కడక్కడా ఇళ్లు కొట్టేందుకు ప్ర యత్నిస్తున్నారన్నారు. ప్రజలు తిరగబడితే ఎవరూ తట్టుకోలేరన్నారు. నీకు నిబంధనలు తెలుసా అని ఎద్దేవా చేశారు. మొదట నోటీసు ఇచ్చి తర్వాత చర్యలు తీసుకోవాలని, ఇన్నాళ్లు ఇల్లు కడుతుంటే ఎందుకు కళ్లప్పగించుకొ ని చూస్తున్నారని ప్రశ్నించారు. రెండు సంవత్సరాల కాలంలో ఎన్ని ఇళ్లు అ క్రమంగా కట్టారో నీకు తెలుసా అని ప్రశ్నించారు. పట్టణంలోని సంతమార్కెట్‌లో కొన్నింటికి ఇళ్లపట్టాలు ఇచ్చారని, మరికొన్నింటికి ఇవ్వలేదన్నారు. పట్టణంలో ఆక్రమణల పేరుతో భయబ్రాంతులకు గురిచేసి తనవైపు తి ప్పుకోవడానికి ఎమ్మెల్యే ప్రయత్నిస్తున్నారన్నారు. బట్టవారికి చెందిన 40 సెంట్లు ఆక్రమణకు గురైందని, వాటిని కొట్టే ధైర్యం నీకు ఉందా అని నిల దీశారు.  పీర్లమాన్యం, ఆంజనేయస్వామి మాన్యాల్లో ఎన్నో ఆక్రమణలు ఉ న్నాయని, వాటికి మార్క్‌ వేసి కూల్చగలవా అని పేర్కొన్నారు. నియమా లు లేకుండా ఎలా కొడతారో నేను చూస్తానని, మున్సిపల్‌ కమిషనర్‌, త హసీల్దార్‌లను ఎవరు ఎలా కాపాడతారో చూస్తానని ఆగ్రహం వ్యక్తం చే శారు. తన హయాంలో అనేక ఆక్రమణలను నిబంధనల ప్రకారం కొట్టాన ని, వారికి పరిహారం కూడా చెల్లించానన్నారు. సన్యాసిమఠంలో ఎలా పట్టా లు ఇప్పిస్తావని, దీనిపై కోర్టుకు వెళతానని హెచ్చరించారు. నీకు చదువు లేదు, నియమ నిబంధనలు  తెలియవు కాబట్టి చదువు, తెలివి ఉన్న పీఏ ను, ఇతర సలహాదారులను పెట్టుకోవాలని సూచించారు. 


Updated Date - 2021-07-26T06:10:30+05:30 IST