బాలీవుడ్‌లో Shah Rukh Khan, Salman Khanల స్నేహ బంధానికి సరిలేరెవ్వరు

బాలీవుడ్ బాద్‌షా షారూక్ ఖాన్ తనయుడు ఆర్యన్ ఖాన్ డ్రగ్స్ కేసులో చిక్కుకుని జైలులో ఉన్న సంగతి తెలిసిందే. ఈ ఆపద కాలంలో బాలీవుడ్ సెలెబ్రిటీలు తమ మద్దతును కూడా తెలుపుతున్నారు. కానీ, షారూఖ్ నివాసాన్ని తరచుగా సందర్శిస్తూ ఎప్పటికి వారి వెన్నంటే ఉంటానంటూ సల్మాన్ చేయూతగా నిలుస్తున్నారు. ఈ నేపథ్యంలో వారి స్నేహ బంధంపై  పాఠకుల కోసం ప్రత్యేక కథనం.. 


షారూఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్ కొన్ని దశాబ్దాలు బాలీవుడ్ ఇండస్ట్రీని ఏలారు. కరణ్ అర్జున్  సినిమాలో వీరిద్దరూ కలిసి నటించారు. ఈ సినిమా 1995లో విడుదలై బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని నమోదు చేసింది. వీరిద్దరని నిజజీవితంలోను కరణ్ అర్జున్‌గా అభిమానులు పిలిచేవారు. ఆ సినిమా సమయంలోనే వీరిద్దరూ బెస్ట్ ప్రెండ్స్‌గా మారారు. ఇంటర్వ్యూలు ఇచ్చినప్పుడు ఒకరి గురించి మరొకరు  గొప్పగా చెప్పేవారు. ఒకరి సినిమాలో మరొకరు అతిథి పాత్రల్లో కనిపించేవారు. కుచ్ కుచ్ హోతా హై చిత్రంలో సల్మాన్ అతిథి పాత్రలో నటించగా, హర్ దిల్ జో ప్యార్ కరేగా సినిమాలో సల్మాన్ అతిథి పాత్రలో మెరిశారు.


ఆ స్నేహ బంధం మున్నాళ్ల ముచ్చటగానే కొనసాగింది. కత్రినా కైఫ్ బర్త్ డే పార్టీలో సల్మాన్, షారూఖ్ ల మధ్య గొడవ మొదలైంది. ఆమిర్ ఖాన్ ఇద్దరికి సర్ది చెప్పేందుకు ప్రయత్నించారు. కొన్ని ఏళ్లు వీరు మాట్లాడుకోవడం మానేశారు. అనంతరం 2014లో బాబా సిద్ధిఖీ ఇచ్చిన ఇఫ్తార్ విందులో వీరు కరచాలనం చేసి మాట్లాడుకున్నారు. 

ఆ పార్టీలో కరచాలనం చేసిన నాటి నుంచి వారు విడిపోలేదు. 


సల్మాన్ 53వ బర్త్‌డే పార్టీలో షారూఖ్ పాట కూడా పాడారు. ఆ పాట సోషల్ మీడియలో విపరీతంగా వైరల్ అయింది.  సోషల్ మీడియాలో వీరు ఒకరిని, మరొకరు ప్రమోట్ చేసుకుంటున్నారు. షారూఖ్ నటించిన జీరో సినిమాలో సల్మాన్ అతిథి పాత్రలో మెరిశారు. షారూఖ్ రాబోయే చిత్రమైన పఠాన్ లోను బాలీవుడ్ కండల వీరుడు గెస్ట్ అపియరెన్స్ ఇవ్వబోతున్నట్టు సమాచారం. ఆర్యన్ ఖాన్ డ్రగ్స్ కేసులో చిక్కుకోవడంతో షారూఖ్ నివాసాన్ని సల్మాన్ తరచుగా సందర్శిస్తూనే ఉన్నారు. అతడి కుటుంబానికి తన మద్దతును ఎప్పటికప్పుడు తెలుపుతూనే ఉన్నారు. తను ఎప్పుడు కష్టాల్లో ఉన్నా సల్మాన్ తనకు అండగా ఉంటాడని బాలీవుడ్ బాద్ షా గతంలో చెప్పారు. గతంలో సల్మాన్ హిట్ అండ్ రన్ కేసును వాదించిన అమిత్ దేశాయ్ ప్రస్తుతం ఆర్యన్ కేసును వాదిస్తుండటం విశేషం.


Advertisement

Bollywoodమరిన్ని...